hyderabadupdates.com movies కేసీఆర్, రేవంత్ ను ఒకేసారి ఎలా ప్రేమిస్తావ్ కడియం?

కేసీఆర్, రేవంత్ ను ఒకేసారి ఎలా ప్రేమిస్తావ్ కడియం?

బీఆర్ ఎస్ పార్టీ తరఫున 2023లో విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కు మద్దతుగా మారిన 10 మంది ఎమ్మెల్యేల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు కేవలం 8 మంది ఎమ్మెల్యేల విచారణనే స్పీకర్ ప్రసాదరావు పూర్తి చేశారు. మిగతా ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల విచారణ వాయిదా పడుతూ వస్తోంది. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఇద్దరిపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించారు.

ఈ క్రమంలో ఇద్దరికీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు. అయితే ముందుగా కడియం శ్రీహరిని విచారించారు. ఆయన విచారణకే సమయం సరిపోవడంతో దానం నాగేందర్ విచారణను శనివారానికి వాయిదా వేశారు. ఆ రోజు అసెంబ్లీ సచివాలయానికి రావాలని దానంకు స్పీకర్ స్పష్టం చేశారు.

ఇక కడియం విచారణలో ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. తాను పార్టీ మారలేదని స్పష్టంగా చెప్పారు. ఎవరు ఏమి చెబితే అది తనకు వర్తించదని పేర్కొన్నారు.

“మీడియాలో వచ్చినవి అన్నీ నిజం కావు. కేసీఆర్ అన్నా, బీఆర్ ఎస్ అన్నా నాకు అభిమానమే” అని ఆయన స్పీకర్‌కు వివరించినట్లు తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం, ఆ పార్టీ తరఫున వాయిస్ వినిపించడం ఏంటన్న ప్రశ్నకు కడియం స్పందిస్తూ, “కాంగ్రెస్ నా అభిమాన పార్టీ. గతంలోనూ నేను కాంగ్రెస్‌ను అభిమానించాను. కావాలంటే రికార్డులు చూడొచ్చు. అభిమానం వేరు, పార్టీ తరఫున విజయం సాధించడం వేరు” అని తెలిపారు.

అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీ అభిమాని అని, అంతమాత్రాన ఆయన కాంగ్రెస్ నాయకుడు కాదా అని ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో కేసీఆర్ కూడా టీడీపీకి అభిమాని అని, అక్కడ పదవులు కూడా చేపట్టారని కడియం ప్రస్తావించినట్లు తెలిసింది.

ఒక ప్రజాప్రతినిధిగా తాను అభివృద్ధిని స్వాగతిస్తున్నానని కడియం వివరించారు. తాను పార్టీ మారినట్లు మీడియాలో వచ్చిన వార్తలకు విశ్వసనీయత లేదన్నారు. తాను ఇప్పటికీ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఈ వ్యవహారంపై స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తారో లేదో చూడాలి. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక దానం నాగేందర్ విచారణ శనివారం జరగనుంది.

కడియం వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకవైపు కేసీఆర్ పై అభిమానముందని చెబుతూ, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కు మద్దతుగా మాట్లాడడం ఎలా సాధ్యమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు. “కేసీఆర్, రేవంత్ ను ఒకేసారి ఎలా ప్రేమిస్తావ్ కడియం?” అంటూ రాజకీయంగా సెటైర్లు వినిపిస్తున్నాయి.

Related Post

Tharun Bhascker Says ‘Santhana Prapthirasthu’ Feels as a Telugu MealTharun Bhascker Says ‘Santhana Prapthirasthu’ Feels as a Telugu Meal

Director and actor Tharun Bhascker, known for his sharp storytelling and natural humor, has shared his heartfelt appreciation for the upcoming film Santhana Prapthirasthu. The movie, starring Vikranth and Chandini

ఆ నటుడిని గుర్తుపట్టలేకపోయిన ప్రభాస్ఆ నటుడిని గుర్తుపట్టలేకపోయిన ప్రభాస్

ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ఎదిగినా కాస్తయినా గర్వం తలకెక్కని నటుడు ప్రభాస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని వంటబట్టించుకుని అందరితోనూ ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు రెబల్ స్టార్. ప్రభాస్ ఎంత సింపుల్‌గా ఉంటాడు.. తోటి ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఎలా గౌరవిస్తాడు అన్నది