hyderabadupdates.com movies కొత్త ట్రెండ్ : థియేటర్లో రెస్టారెంట్

కొత్త ట్రెండ్ : థియేటర్లో రెస్టారెంట్

మాములుగా ఇంట్లో ఉన్నప్పుడు అన్నం లేదా చపాతీ తింటూ సినిమాలు టీవీలో చూడటం సహజం. ఇందులో వింతేమీ లేదు. అలాగే పాప్ కార్న్, నాచోస్ నములుతూ థియేటర్లో బిగ్ స్క్రీన్ ఎంజాయ్ చేయడం కొత్తేమి కాదు. కానీ ఈ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది. పివిఆర్ ఐనాక్స్ ఆ ఆలోచన రావడం ఆలస్యం అమలులో పెట్టేసింది. బెంగళూరులోని ఎం5 సిటీ మాల్ లో ఉన్న ఎనిమిది స్క్రీన్ల సముదాయంలో ఒకదాన్ని పూర్తి రెస్టారెంట్ గా మార్చేసింది. అంటే మనం హోటల్ లో ఎలాగైతే రౌండ్ టేబుల్ చుట్టూ కూచుని తింటామో అచ్చం అలాగే ఇందులో కూడా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో పాటు డైనిన్ చేయొచ్చు.

ధరలు కొంచెం ప్రియంగానే ఉన్నాయి. ఉదాహరణకు కాంతార చాప్టర్ 1 నలుగురు కలిసి చూడాలంటే జస్ట్ 1340 రూపాయలు చెల్లించాలి. ముగ్గురు ఉంటే 820, ఇద్దరు ఉంటే 740 రూపాయలు చెల్లించాలి. వీటికి బుకింగ్ చార్జీలు అదనం. విడిగా లెక్క చూస్తే ఇంత ఖరీదైన ఎక్స్ పీరియన్స్ కి ఇది సబబైన ధరే. అందుకే మొదలుపెట్టడం ఆలస్యం టికెట్లు చాలా ముందస్తుగా అమ్ముడుపోతున్నాయట. అయితే తినడం మీద దృష్టి పెట్టి సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం ఇలాంటి వాటి వల్ల కోల్పోతారనే కామెంట్స్ ఉన్నప్పటికి జనాలు అవేవి పట్టించుకోకుండా శుభ్రంగా టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు.

ఒకప్పుడు తెల్లని బట్టలాంటి తెరమీద మసక ప్రొజెక్టర్లతో సినిమాలు చూపించేవాళ్ళు. నేల క్లాసు విడిగా ఉండేది. బటానీలు, సమోసాలు, సోడాలు తాగుతూ తింటూ అదో రకమైన ఆనందాన్ని మొన్నటి తరం ప్రేక్షకులు పొందారు. తర్వాత ఏసీలు పెరిగాయి. సోఫాలు వచ్చాయి. కుషన్ సీట్లు, పుష్ బ్యాక్లు, రిక్లైనర్లు ఒకటా రెండా రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. 3డి, 4డిఎక్స్, ఐస్, డి బాక్స్, ఎపిక్ స్క్రీన్ అంటూ కొత్త కొత్త ఎక్స్ పీరియన్సులు పంచుతున్నాయి. ఇప్పుడు భోజనాలు చేస్తూ సినిమా చూడటమనే వెరైటీ ట్రెండ్ క్రమంగా పెరిగేలా ఉంది. దేశవ్యాప్తంగా త్వరలో అయిదారు మొదలుపెడతారట.

Related Post

టికెట్ రేట్లు పెంచకుండానే మేజిక్ చేసిందిటికెట్ రేట్లు పెంచకుండానే మేజిక్ చేసింది

మిరాయ్ 150 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు పెట్టింది. పవన్ కళ్యాణ్ ఓజి వచ్చాక పూర్తిగా ఫైనల్ రన్ కు వచ్చేస్తుందని భావించిన ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తూ మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉండటం బయ్యర్ వర్గాలను సంతోషంలో ముంచెత్తుతోంది. నిజానికి

వైసీపీ నేత‌ల‌కు మ‌ళ్లీ జైలుకే … ‘లిక్క‌ర్’ కేసు పాట్లు!వైసీపీ నేత‌ల‌కు మ‌ళ్లీ జైలుకే … ‘లిక్క‌ర్’ కేసు పాట్లు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ విచార‌ణ ఖైదీలుగా ఉన్న నాయ‌కుల‌ను మ‌ళ్లీ జైలుకు త‌ర‌లిస్తూ.. విజ‌య‌వాడ కోర్టు తీర్పు ఇచ్చింది. 2019-24 మ‌ధ్య వైసీపీ హ‌యాంలో నూత‌న మ‌ద్యం విధానాన్ని అమ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో డిస్టిల‌రీల

అజారుద్దీన్‌కి ఏమేమి శాఖలు ఇచ్చారంటే!అజారుద్దీన్‌కి ఏమేమి శాఖలు ఇచ్చారంటే!

మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్‌ గత నెల 31న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బెర్త్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పట్లో అజారుద్దీన్‌కు హోం