hyderabadupdates.com Gallery ‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్

‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్

‘కొత్త మ‌లుపు’ మూవీ  ఫ‌స్ట్ లుక్ లాంచ్ post thumbnail image

హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ఆకాష్‌, భైర‌వి అర్ద్యా క‌లిసి న‌టించిన చిత్రం కొత్త మ‌లుపు. ఇందుకు సంబంధించి హైద‌రాబాద్ లో బుధ‌వారం మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వ‌హించారు. తాటి బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతోంది ఈ చిత్రం . అంతే కాకుండా ఈ మూవీలో సీనియర్ నటులు రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్ర‌లు పోషించారు.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడారు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం అని చెప్పారు. ఆకాష్–భైరవి జోడీ చాలా చక్కగా కుదిరిందని అన్నారు. వీరు బావ–మరదలుగా నటిస్తున్నార‌ని తెలిపారు. సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశామ‌ని,. త్వరలోనే సినిమా విడుదల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. గ్రామీణ వాతావరణంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంద‌న్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తామ‌న్నారు.
గ్రామీణ నేపథ్యంతో ప్రేమ–సస్పెన్స్–కామెడీ మేళవింపుతో రూపొందుతున్న కొత్త మలుపు ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
The post ‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

డ్రైవ‌ర్ కొడుక్కి టీవీకే అసెంబ్లీ టికెట్ వైర‌ల్డ్రైవ‌ర్ కొడుక్కి టీవీకే అసెంబ్లీ టికెట్ వైర‌ల్

చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌కీయాలు రోజు రోజుకు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఏప్రిల్ నెల‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు, తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమ‌య్యాడు టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ అలియాస్ జోసెఫ్ విజ‌య్. తాజాగా

వ‌ద్ద‌నుకుంటే విషం ఇచ్చి చంపేయండి : కోమ‌టిరెడ్డివ‌ద్ద‌నుకుంటే విషం ఇచ్చి చంపేయండి : కోమ‌టిరెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఓ సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ కు మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తోందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డం, విస్తృతంగా సామాజిక మాధ్య‌మాల‌లో

దేశంలో పెట్రోల్, గ్యాస్ కు ఎలాంటి కొర‌త లేదుదేశంలో పెట్రోల్, గ్యాస్ కు ఎలాంటి కొర‌త లేదు

న్యూఢిల్లీ : ప‌శ్చిమాశియాలో చోటు చేసుకున్న యుద్ద వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. లోక్ స‌భ‌లో ప‌లువురు ఎంపీలు దేశంలో నెల‌కొన్న గ్యాస్ , పెట్రోల్ , ఆయిల్