hyderabadupdates.com movies కొలిక్కి రాబోతున్న విశ్వంభర వ్యవహారం

కొలిక్కి రాబోతున్న విశ్వంభర వ్యవహారం

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎంజాయ్ చేశాక మెగాస్టార్ ఫ్యాన్స్ దృష్టి క్రమంగా విశ్వంభర వైపు వెళ్తోంది. అయితే విడుదల ఎప్పుడనే దాని మీద స్పష్టత రాకపోవడంతో కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం జూలై విడుదల దాదాపు ఖరారైనట్టే. ఆలోగా ఓటిటి ఒప్పందం కూడా ఒక కొలిక్కి వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

థియేటర్ బిజినెస్ పరంగా టెన్షన్ లేదు. ఎందుకంటే చిరు స్టామినాకు అదేమీ సమస్య కాదు. ఎటొచ్చి అంత రేట్ పెట్టొచ్చనే నమ్మకం బయ్యర్లలో రావాలంటే ట్రైలర్ మొదలుపెట్టి ప్రమోషన్ మెటీరియల్ దాకా అంతా హై రేంజ్ లో ఉండాలి.

ఒకవేళ జూలై మిస్ అయితే పెద్ద సమస్య వస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ లో జైలర్ 2, ప్యారడైజ్, భోగి లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ క్యూ కట్టాయి. ఇంకో చిక్కు ఏమిటంటే ఏప్రిల్ లోనే నిఖిల్ స్వయంభు వచ్చేస్తుంది. వేసవిలో విరాట్ కర్ణ నాగబంధం ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఈ రెండింటి మీద మీడియాలో, బయ్యర్ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.

వద్దన్నా విశ్వంభరకు వీటితో పోలిక వస్తుంది. వాటి కన్నా మెరుగనో లేదా అదే స్థాయిలో ఉన్నాయనే టాక్ విశ్వంభర గురించి సోషల్ మీడియాలో వినిపించాలి. ఆషామాషీ పబ్లిసిటీతో ఇదంతా జరగదు. ఓ రేంజ్ ప్రచారంతో హోరెత్తించాలి..

ఏప్రిల్ లో చిరంజీవికి విశ్వంభర ఫైనల్ కట్ చూపిస్తారని సమాచారం. ట్రైలర్ రెడీ అవుతోంది. వీలైతే రిలీజ్ డేట్ తో పాటు ఉగాదికి దీన్ని వదిలితే ఎలా ఉంటుందనే ఆలోచన టీమ్ లో ఉంది. పైగా వచ్చే వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది నుంచి సాలిడ్ అప్డేట్స్ రాబోతున్నాయి. వాటి మధ్య విశ్వంభరని ఇరికించకూడదు.

అందుకే యువి క్రియేషన్స్ ఇంకొన్ని వారాలు వేచి చూడడానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. తనను అడిగిన మెగా ఫ్యాన్స్ కు దర్శకుడు విశిష్ట పెద్ద హామీ ఇస్తున్నారు. ఇది లైఫ్ టైం అవకాశమని, ఒక్క శాతం కూడా నిరాశ పరచనని అంటున్నాడు. అది నిజమైతే అంతకన్నా అభిమానులు కోరుకునేది ఏముంది.

Related Post

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే ముందు చివ‌ర‌గా న‌టించిన చిత్రం.. జ‌న‌నాయ‌గ‌న్. తెలుగు హిట్ మూవీ భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్‌గా తెర‌కెక్కిన‌ప్ప‌టికీ… విజ‌య్ పొలిటిక‌ల్ జ‌ర్నీకి

Prabhas’ The Raja Saab 1st Single announced with a vibrant posterPrabhas’ The Raja Saab 1st Single announced with a vibrant poster

Pan India Rebel Star Prabhas, is gearing up to charm audiences once again. The beloved superstar and favourite darling collaborated with director Maruthi for an upcoming project titled “The Raja