hyderabadupdates.com Gallery కోకో సాగు ద్వారా రైతన్నల‌కు అధిక ఆదాయం

కోకో సాగు ద్వారా రైతన్నల‌కు అధిక ఆదాయం

కోకో సాగు ద్వారా రైతన్నల‌కు అధిక ఆదాయం post thumbnail image

ఏలూరు జిల్లా : కోకో సాగు ద్వారా రైత‌న్న‌ల‌కు అత్య‌ధిక ఆదాయం ల‌భిస్తోంద‌ని అన్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. శుక్ర‌వారం ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించి ప్ర‌సంగించారు అచ్చెన్నాయుడు. కోకో సాగు రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంటగా అభివృద్ధి చెందుతోంద‌ని చెప్పార‌రు. కోకో సాగు విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక సాగు విధానాలపై ఈ కాంక్లేవ్‌లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు. కోకో ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత లాభాలు సాధ్యమవుతాయని అఅన్నారు మంత్రి అచ్చెన్నాయుడు . ప‌నిలో ప‌నిగా రైతులకు నిపుణుల సలహాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు.
ఈ సంద‌ర్బంగా అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కోకో సాగు ఉత్పత్తి, నాణ్యత పెంపుతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్‌కు అనుసంధానం కల్పిస్తామని హామీ ఇచ్చారు .కోకో రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని స్ప‌ష్టం చేశారు. కోకో అభివృద్ధితో ఉద్యానవన రైతుల ఆర్థిక స్థితి మరింత మెరుగు పడుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు అచ్చెన్నాయుడు. గ‌తంలో కొలువు తీరిన వైసీపీ జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ రైతుల‌ను పూర్తిగా విస్మ‌రించింద‌ని ఆరోపించారు. దీంతో వ్య‌వ‌సాయ రంగం మ‌రింత తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోయింద‌ని, ప్ర‌స్తుతం తాము వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి. త‌మ ప్ర‌భుత్వం రైతుల‌కు నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువుల‌ను , ప‌నిముట్టు ప‌రిక‌రాల‌ను అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామ‌న్నారు.
The post కోకో సాగు ద్వారా రైతన్నల‌కు అధిక ఆదాయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వేCM Chandrababu: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

    మొంథా తుపాను పెనువిపత్తని… రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డుమార్గంలో వెళ్లి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో పునరావాస కేంద్రాన్ని

Supreme Court: లాయర్ రాకేష్‌ కిషోర్‌ పై సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చSupreme Court: లాయర్ రాకేష్‌ కిషోర్‌ పై సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ

Supreme Court : తనపై షూ విసిరిన లాయర్‌(సస్పెండెడ్‌) రాకేష్‌ కిషోర్‌ (Rakesh Kishore) ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌ క్షమించినా… న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాలని

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదలJammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదల

    జమ్మూకశ్మీర్‌ లో 370వ అధికరణ రద్దు తర్వాత రాజ్యసభకు తొలిసారి శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగగా… ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకుని