hyderabadupdates.com movies కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తున్న విశిష్టమైన ఉత్సవం. ఏకాదశ రుద్రులతో కూడిన ప్రభలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భుజాలపై ఎత్తుకుని నిర్వహించే ఈ వేడుకకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

ఈ ప్రభల తీర్థాన్ని దర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కోనసీమకు తరలివస్తుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఆ రోజు ఉపవాసం ఉండి, తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యువత పెద్ద సంఖ్యలో ప్రభల తీర్థానికి వెళ్లి ప్రభలను భుజాలపై మోసుకుంటారు.

ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రభల తీర్థానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ ఎన్నాళ్ల నుంచో ఉంది. అయితే ఇది ప్రతి సారి వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకకు అయ్యే ఖర్చును భరించడమే కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. ఈ నెల 16న కనుమ రోజున జరిగే ప్రభల తీర్థం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిధులతో మరింత వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు.

బాబు ఏమన్నారంటే..

తాజాగా సీఎం చంద్రబాబు ప్రభల తీర్థంపై స్పందించారు. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని పేర్కొన్నారు. దీనిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కనుమ రోజున జరిగే ఈ అతిపెద్ద పండుగ తెలుగువారికి గర్వకారణమని చెప్పారు.

ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విశేషాన్ని దేశ ప్రజలకు తెలియజేశారని చంద్రబాబు గుర్తు చేశారు.

Related Post

రాజుగారు సౌండ్ చేయడం లేదెందుకురాజుగారు సౌండ్ చేయడం లేదెందుకు

ఎంత పోటీ ఉన్నా సరే సంక్రాంతికి వచ్చే తీరతాం అని శపధం చేసిన సినిమాల్లో అనగనగా ఒక రాజు ఉంది. నవీన్ పోలిశెట్టి హీరోగా మారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ జనవరి 14 డేట్ ఎప్పుడో వేసుకుంది. దానికి

బాబుతో `క‌లిసి` వెళ్ల‌డం వెనుక మోడీ వ్యూహం ఇదేనా?!బాబుతో `క‌లిసి` వెళ్ల‌డం వెనుక మోడీ వ్యూహం ఇదేనా?!

“ఫ‌లానా వ్య‌క్తితో క‌లిసి ప‌నిచేయండి.. ఫ‌లానా పార్టీతో చేతులు క‌ల‌పండి!“ అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ ఎవ‌రికీ చెప్పిన‌ట్టు లేదు. ఒక‌వేళ చెప్పినా.. ఆయ‌న బ‌హిరంగ వ్యాఖ్య‌లు కూడా చేసింది లేదు. కానీ, తొలిసారి ఏపీలోని