hyderabadupdates.com movies క్యాస్టింగ్ పనుల్లో చిరు బాబీ మూవీ

క్యాస్టింగ్ పనుల్లో చిరు బాబీ మూవీ

మన శంకరవరప్రసాద గారు బ్లాక్ బస్టర్ ఎంజాయ్ చేసిన చిరంజీవి నెక్స్ట్ బాబీ దర్శకత్వం వహించబోయే మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలు కావాల్సి ఉంది. అయితే నిర్మాణ సంస్థ కెవిఎన్ ఒకపక్క జన నాయకుడు పోస్ట్ పోన్, ఇంకో వైపు టాక్సిక్ రిలీజ్ ప్లస్ కాంట్రవర్సీలతో బిజీగా ఉండటంతో కొంత వాయిదా వేసినట్టు టాక్ ఉంది. వీలైతే ఏప్రిల్ లేదా మే నుంచి రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్లొచ్చని తెలిసింది. చిరు సరసన ఆయన భార్యగా ప్రియమణి, కూతురి పాత్రలో ఛాంపియన్ ఫేమ్ అనస్వర రాజన్ దాదాపుగా లాకైనట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ కాలేదు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయిన విషయం మరొకటి ఉంది. అదే మోహన్ లాల్ క్యారెక్టర్. చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసిన ఆ పాత్రకు ఆయన సానుకూలంగా స్పందించారట కానీ డేట్ల సమస్య వల్ల ఈ ప్రాజెక్టు వదలుకోవచ్చని అంటున్నారు. అందుకే అనౌన్స్ మెంట్ గట్రా ఇవ్వకుండా ఆగారట. ఒకవేళ లాలెట్టాన్ వద్దనుకుంటే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది వేచి చూడాలి. మమ్ముట్టిని ఆప్షన్ గా పెట్టుకోకపోవచ్చు. ఎందుకంటే మోహన్ లాల్ డ్రాపయ్యింది ఆయన ఇష్టపడకపోవచ్చని మల్లువుడ్ టాక్ ఉంది. ఇంతకు ముందు కార్తీని కూడా అడిగారట కానీ అదెంతమేరకు నిజమో తెలియాల్సి ఉంది.

ప్రాధమికంగా ఈ సినిమాకు సెట్ చేసుకున్న విడుదల 2027 సంక్రాంతి. ఇప్పుడు జరుగుతున్న ఆలస్యం చూస్తే ఆ డెడ్ లైన్ మీట్ కావడం కష్టంగా ఉంది . ఎందుకంటే అనిల్ రావిపూడి లాగా బాబీ వేగంగా తీయలేడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయితే సాధ్యమవ్వొచ్చు కానీ ఇది పూర్తిగా గ్యాంగ్ స్టర్ డ్రామా. బోలెడు యాక్షన్ ఎపిసోడ్లు, ఫైట్లు ఉంటాయి. డ్యూయెట్లు పెట్టకపోయినా మిగిలిన వాటికి పెద్ద ఎత్తున రిస్క్, బడ్జెట్ అవసరమవుతుంది. ఇది వీలైనంత త్వరగా పూర్తి చేస్తే చిరంజీవి ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా పనుల్లో దిగాల్సి ఉంటుంది. వీటికన్నా ముందే విశ్వంభర విడుదల వ్యవహారం ఉండనే ఉంది.

Related Post

How is Amala Akkineni’s rapport with Naga Chaitanya’s wife Sobhita Dhulipala?How is Amala Akkineni’s rapport with Naga Chaitanya’s wife Sobhita Dhulipala?

Amala Akkineni last appeared in the Hindi-language film Tumse Na Ho Payega and has largely stayed away from the limelight since. After the weddings of her sons, Naga Chaitanya and

జైలులో ఉన్న హీరో అంటే ఇంత పిచ్చి ఉందాజైలులో ఉన్న హీరో అంటే ఇంత పిచ్చి ఉందా

స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడం నిజమేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. స్వంత అభిమానిని హత్య చేసిన కేసులో బెంగళూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ కటకటాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన కొత్త సినిమా డెవిల్ రేపు