hyderabadupdates.com movies క్రిస్మస్ సినిమాల ప్రిమియర్స్ పోరు

క్రిస్మస్ సినిమాల ప్రిమియర్స్ పోరు

చిన్న, పెద్ద అని తేడా లేకుండా రిలీజ్‌కు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా చిన్న చిత్రాలకు బజ్ క్రియేట్ చేయడం కోసం ఒకట్రెండు రోజుల ముందే స్పెషల్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి ప్రయోజనం పొందిన సినిమాలున్నాయి. అలాగే ముందే నెగెటివ్ టాక్‌తో దెబ్బ తిన్న చిత్రాలూ ఉన్నాయి. 

క్రిస్మస్‌కు అరడజనుకు పైగా సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో తమ సినిమాల ప్రత్యేకతను చాటేందుకు.. బజ్ పెంచేందుకు ప్రిమియర్స్‌కు రెడీ అయిపోతున్నాయి టీమ్స్. ఈ వీకెండ్లో అయిదు తెలుగు చిత్రాలు రిలీజవుతుండగా.. అందులో మూడింటికి ప్రిమియర్స్ కన్ఫమ్ అయ్యాయి. క్రిస్మస్ సినిమాలన్నీ గురువారమే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 

వీటిలో శివాజీ, నవదీప్, నందు, బిందుమాధవి ప్రధాన పాత్రలు పోషించిన ‘దండోరా’ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ప్రిమియర్స్‌కు వెళ్తోంది. మంగళవారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నారు. తర్వాతి రోజు రెండు సినిమాలకు ప్రిమియర్స్ పడుతున్నాయి. 

ఆది సాయికుమార్ కెరీర్లో గేమ్ చేంజర్‌గా భావిస్తున్న ‘శంబాల’కు బుధవారం వేయబోతున్న ప్రిమియర్స్‌కు బుకింగ్స్ కూడా ఓపెనయ్యాయి. స్పందన చాలా బాగుంది. అదే రోజు హార్రర్ మూవీ ‘ఈషా’కు కూడా ప్రిమియర్స్ వేయబోతున్నారు. ‘పతంగ్’, ‘బ్యాడ్ గర్ల్స్’ సినిమాల సంగతేంటో తెలియదు. ఈ వారం వస్తున్న వాటిలో అత్యధిక అంచనాలున్న రోషన్ మేక సినిమా ‘ఛాంపియన్’కు మాత్రం ప్రిమియర్స్ ఏమీ లేనట్లే ఉన్నాయి. ఐతే మిగతా సినిమాలను చూసి దానికి కూడా స్పెషల్ షోలు ప్లాన్ చేస్తే ఆశ్చర్యం లేదు. 

Related Post

Internet Can No Longer Be Trusted As a Space of Truth: Rashmika MandannaInternet Can No Longer Be Trusted As a Space of Truth: Rashmika Mandanna

After Janhvi Kapoor’s emotional remarks on how social media turned personal grief into content, actress Rashmika Mandanna has now expressed her deep concern over the growing misuse of online platforms