hyderabadupdates.com movies క్రిస్మస్ సినిమాల్లో రెండు సర్ప్రైజ్‌లు

క్రిస్మస్ సినిమాల్లో రెండు సర్ప్రైజ్‌లు

ఈ ఏడాది చివరి వీకెండ్లో ఏకంగా అరడజను సినిమాలు రిలీజయ్యాయి. క్రిస్మస్ వీకెండ్ కావడంతో పోటీ ఉన్నా పర్వాలేదని ఒకేసారి అన్ని సినిమాలనూ రిలీజ్ చేసేశారు. ఈ చిత్రాలన్నీ చిన్న, మిడ్ రేంజివే. ఐతే ఈ అరడజను సినిమాల్లో దేనికీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. డబ్బింగ్ సినిమా అయిన ‘వృషభ’ ఔట్ రైట్ డిజాస్టర్ అని ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే తేలిపోయింది.

మిగతా అయిదు తెలుగు చిత్రాల్లో ‘శంబాల’ బెటర్ టాక్ తెచ్చుకుని ఆ టాక్‌కు తగ్గట్లే వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది. ‘ఛాంపియన్’‌కు బిలో యావరేజ్ టాక్ రాగా.. వసూళ్లు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. రిలీజ్ ముంగిట అస్సలు సౌండ్ చేయని ‘పతంగ్’ అనే చిన్న సినిమాకు మంచి టాకే వచ్చింది. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. మిగతా రెండు చిత్రాల బాక్సాఫీస్ రన్ మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

శివాజీ ముఖ్య పాత్ర పోషించిన ‘దండోరా’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. వాస్తవ ఘటనల ఆధారంగా కులం సమస్య చుట్టూ హార్డ్ హిట్టింగ్ డ్రామాగా ‘దండోరా’ను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఐతే చూసిన వాళ్లంతా మంచి సినిమా అంటున్నా.. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇలాంటి సినిమా వేరే భాషలో వస్తే మన వాళ్లు ఆహా ఓహా అంటారని, తెలుగులో వస్తే మాత్రం ఆదరించడం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇంత పోటీ మధ్య రావడం ఈ సినిమాకు చేటు చేసిందని అంటున్నారు. సీరియస్ సినిమా కావడం మైనస్ అయిందనే వాదనా వినిపిస్తోంది. డీసెంట్ టాక్, రివ్యూలు తెచ్చుకున్న సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. బ్యాడ్ టాక్, నెగెటివ్ రివ్యూలతో మొదలైన ‘ఈషా’ సినిమాకు మాత్రం అంచనాలకు మించే వసూళ్లు వస్తున్నాయి.

రిలీజ్ డే నుంచి ప్రతి రోజూ కొన్ని షోల వరకు ఈ సినిమాకు ఫుల్స్ పడుతున్నాయి. చాలా షోలకు మంచి ఆక్యుపెన్సీలే కనిపిస్తున్నాయి. ఆదివారం కూడా పరిస్థితి మెరుగ్గానే ఉంది. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కావడంతో వీకెండ్ లోపలే సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోవడం విశేషం. ఈ రెండు చిత్రాల ఫలితాలు చూసి.. ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఎలా ఆదరిస్తారో అర్థం కాదని ఫిలిం మేకర్స్ తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.

Related Post

ప్ర‌భుత్వం మార‌దు.. పెట్టుబ‌డులు పెట్టండి – తేల్చేసిన సీఎం!ప్ర‌భుత్వం మార‌దు.. పెట్టుబ‌డులు పెట్టండి – తేల్చేసిన సీఎం!

రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేవారికి ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా గురువారం ఉద‌యం ఆయ‌న విశాఖ‌లో యూర‌ప్ దేశాల‌కు చెందిన పెట్టుబ‌డి దారుల‌తో ఓ హోట‌ల్ లో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా బాబు మాట్లాడుతు.. అనేక

Jana Nayagan: Thalapathy Vijay starrer’s trailer to release on December 31?Jana Nayagan: Thalapathy Vijay starrer’s trailer to release on December 31?

Thalapathy Vijay-starrer Jana Nayagan is slated to release in theaters on January 9, 2026, coinciding with Pongal/Sankranti next year. Ahead of its release, the makers seem to have planned the

తుఫానును ఆప‌లేదు.. కానీ: చంద్ర‌బాబుతుఫానును ఆప‌లేదు.. కానీ: చంద్ర‌బాబు

తాజాగా వ‌చ్చిన మొంథా తుఫాను, అనంత‌రం జ‌రిగిన న‌ష్టం.. క‌ష్టంపై సీఎం చంద్ర‌బాబు గురువారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు అధికారుల‌తో స‌మీక్ష‌ల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌తి ప్రాంతం, మండ‌లం స‌హా గ్రామాల నుంచి స‌మాచారం సేక‌రించారు. ఎంత న‌ష్టం వ‌చ్చింది..