hyderabadupdates.com movies గంజాయి కంటే ఏది ఎక్కువ కిక్కు ఇస్తుందో చెప్పిన పవన్

గంజాయి కంటే ఏది ఎక్కువ కిక్కు ఇస్తుందో చెప్పిన పవన్

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరికిన సంగతి తెలిసిందే. దేశంలో గంజాయి ఏ మూల పట్టుబడ్డా…దాని మూలాలు ఏపీలో ఉండేవంటే అతిశయోక్తి కాదు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో వందల ఎకరాల్లో గంజాయి పంట సాగవుతున్నా సరే అప్పటి వైసీపీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో, విశాఖ వంటి నగరాలతో పాటు గుంటూరు జిల్లాలోని మారుమూల పల్లెల్లో సైతం గంజాయి లభ్యమైంది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి మరీ వందల ఎకరాల గంజాయి పంటను తగులబెట్టారు. గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపింది కూటమి ప్రభుత్వం.

ఈ క్రమంలోనే గంజాయి మహమ్మారికి బానిస కావొద్దని యువతకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గంజాయి కంటే మార్షల్ ఆర్ట్స్ ఎక్కువ కిక్ ఇస్తాయని, వాటిని నేర్చుకోవాలని పవన్ హితవు పలికారు. జెన్ జడ్ యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే అసలైన హై అంటే ఏంటో తెలుస్తుందని పవన్ అన్నారు. బాక్సింగ్ లేదా ఏదైనా ఆటలవైపు దృష్టి మళ్లించుకోవాలని, అప్పుడే గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉంటారని పవన్ చెప్పారు.

20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు ఇప్పటి జెన్ జడ్ యువత మాదిరిగానే తనకూ చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉండేవని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే, తాను మార్షల్ ఆర్ట్స్ వైపు దృష్టిసారించానని, తనను తాను క్రమశిక్షణ మార్గంలో పెట్టుకున్నానని చెప్పారు. తాను ఒక్కడిని డిసిప్లెన్ గా ఉండడంతో ఈ రోజు తన వెనుక కోట్లాదిమంది జనసైనికులు, ప్రధాని దృష్టిలో పడేంత స్థాయికి ఆ క్రమ శిక్షణ తీసుకువెళ్లిందని పవన్ గర్వంగా అన్నారు.

Related Post

‘IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ అసంభవం’‘IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ అసంభవం’

మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 కోసం క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా, ఈ మెగా టోర్నీపై తరచుగా వచ్చే ఫిక్సింగ్ ఆరోపణలపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ స్పందించారు. ఐపీఎల్ అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, దాని వెనుక