hyderabadupdates.com movies గంజాయి కంటే ఏది ఎక్కువ కిక్కు ఇస్తుందో చెప్పిన పవన్

గంజాయి కంటే ఏది ఎక్కువ కిక్కు ఇస్తుందో చెప్పిన పవన్

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరికిన సంగతి తెలిసిందే. దేశంలో గంజాయి ఏ మూల పట్టుబడ్డా…దాని మూలాలు ఏపీలో ఉండేవంటే అతిశయోక్తి కాదు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో వందల ఎకరాల్లో గంజాయి పంట సాగవుతున్నా సరే అప్పటి వైసీపీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో, విశాఖ వంటి నగరాలతో పాటు గుంటూరు జిల్లాలోని మారుమూల పల్లెల్లో సైతం గంజాయి లభ్యమైంది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి మరీ వందల ఎకరాల గంజాయి పంటను తగులబెట్టారు. గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపింది కూటమి ప్రభుత్వం.

ఈ క్రమంలోనే గంజాయి మహమ్మారికి బానిస కావొద్దని యువతకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గంజాయి కంటే మార్షల్ ఆర్ట్స్ ఎక్కువ కిక్ ఇస్తాయని, వాటిని నేర్చుకోవాలని పవన్ హితవు పలికారు. జెన్ జడ్ యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే అసలైన హై అంటే ఏంటో తెలుస్తుందని పవన్ అన్నారు. బాక్సింగ్ లేదా ఏదైనా ఆటలవైపు దృష్టి మళ్లించుకోవాలని, అప్పుడే గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉంటారని పవన్ చెప్పారు.

20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు ఇప్పటి జెన్ జడ్ యువత మాదిరిగానే తనకూ చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉండేవని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే, తాను మార్షల్ ఆర్ట్స్ వైపు దృష్టిసారించానని, తనను తాను క్రమశిక్షణ మార్గంలో పెట్టుకున్నానని చెప్పారు. తాను ఒక్కడిని డిసిప్లెన్ గా ఉండడంతో ఈ రోజు తన వెనుక కోట్లాదిమంది జనసైనికులు, ప్రధాని దృష్టిలో పడేంత స్థాయికి ఆ క్రమ శిక్షణ తీసుకువెళ్లిందని పవన్ గర్వంగా అన్నారు.

Related Post

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలుఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా హెచ్చరికలతో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత రాయబార కార్యాలయం తమ పౌరులను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని అడ్వైజరీ జారీ

బీహార్ ఎఫెక్ట్: రాహుల్ గ్రాఫ్ విచ్ఛిన్నమే!బీహార్ ఎఫెక్ట్: రాహుల్ గ్రాఫ్ విచ్ఛిన్నమే!

బీహార్‌లో జరిగిన రెండు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీనికి సంబంధించి తాజాగా ప్రజల నాడి ఇదేనంటూ కొన్ని సర్వేలు కూడా వెలుగుచూశాయి. అయితే ఏ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాఘఠ్ బంధన్‌కు పెద్దగా మార్కులు వేయలేదు. అంతేకాదు,