hyderabadupdates.com Gallery గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన స‌ర్కార్

గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన స‌ర్కార్

గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన స‌ర్కార్ post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం అధికారికంగా గ‌త ఏడాది 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దివంగ‌త ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డుల‌కు సంబంధించి విజేత‌ల వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డించింది. ఇందులో భాగంగా ఉత్త‌మ న‌టుడిగా అక్కినేని నాగ చైత‌న్య తండేల్ మూవీకి గాను ఎంపిక‌య్యారు. ఉత్త‌మ న‌టిగా ది గ‌ర్ల్ ఫ్రెండ్ లో న‌టించిన ర‌ష్మిక మంద‌న్నా, ఉత్త‌మ చిత్రంగా తెలంగాణ కు చెందిన ద‌ర్శ‌కుడు తీసిన రాజు వెడ్స్ రాంబాయి ఎంపికైంది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా దండోరా, ఉత్తమ తృతీయ చిత్రంగా ది ప్రీ వెడ్డింగ్‌ షో , నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా తండేల్ ఎన్నికైంది. ఉత్తమ పర్యావరణ చిత్రంగా ఇగ్వా, ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ గా లిటిల్‌ హార్డ్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం ఎంపికైంది.
ఇక ఉత్త‌మ సామాజిక సందేశాత్మ‌క చిత్రంగా కోర్టు మూవీ ఎంపిక కాగా ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీగా మిరాయ్‌, ఉత్తమ బాలల చిత్రంగా అనగన‌గ, ఉత్తమ దర్శకుడిగా రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సాయిలు ఎంపిక‌య్యాడు. ఉత్తమ సపోర్టింగ్‌ నటుడిగా శివాజీ , ఉత్తమ సపోర్టింగ్‌ నటిగా భూమిక, ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె రాబిన్‌ (దండోరా) ఎంపిక‌య్యాడు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి), ఉత్తమ నేపథ్య గాయనిగా సాహితి చాగంటి (కన్నప్ప) , ఉత్తమ హాస్యనటుడిగా కృష్ణ తేజ (జిగ్రీస్‌), ఉత్తమ బాలనటుడిగా రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో) , ఉత్తమ కథా రచయిత గా గుణశేఖర్‌ (యుఫోరియా), ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్ గా అనిల్‌ రావిపూడి , ఉత్తమ గేయ రచయితగా నందకిశోర్‌ (కుబేర) ఎంపిక‌య్యాడు.
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌), ఉత్తమ ఎడిటర్ గా శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌) , ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ కిష్కిందపురి, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా గిర గిర గిర, ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ తోట తరణి (ఛాంపియన్‌), ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ – గోవింద్ ( అఖండ), ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్ గా చంద్రకాంత్ ఛాంపియ‌న్ మూవీ కోసం ఎంపిక‌య్యాడు. ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ గా 23, ఉత్తమ మేల్‌ యాక్టర్ గా చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి), ఉత్తమ నటిగా అనంతిక (8 వసంతాలు), స్పెషల్‌ జ్యూరీ హీరో గా రోషన్‌ (చాంపియన్‌) ఎంపిక‌య్యారు.
The post గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన స‌ర్కార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీబీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఎన్నిక‌ల్లో ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై

Minister Giriraj Singh: 100% పత్తి కొనుగోలు చేస్తాం – కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌Minister Giriraj Singh: 100% పత్తి కొనుగోలు చేస్తాం – కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌

Giriraj Singh : తెలంగాణ రైతులు పండించే పత్తిని 100% సీసీఐ ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ (Giriraj Singh) ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను 110 నుంచి 122కి

రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎంరాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎం

విజ‌య‌న‌గ‌రం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం విజ‌య‌న‌రం జిల్లా చీపురుప‌ల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ్యాక్సినేష‌న్ అనేది ప్ర‌తి ఒక్క‌రు తీసుకోవాల‌ని