hyderabadupdates.com Gallery గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్ post thumbnail image

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదన్నారు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందన్నారు సీఎల్పీ సమావేశంలో .ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ చేసిన ప్ర‌సంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదని అన్నారు సీఎం. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయి పోయిందన్నారు. మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టి సారించాల‌ని దిశా నిర్దేశం చేశారు . సభలో మాట్లాడే అంశాలపై విప్ ల మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాల‌న్నారు సీఎం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సబ్జెక్ట్ మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వ లేద‌ని వాపోయారు. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదని గుర్తు చేశారు. సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నన్ను సభకు రాకుండా చేశారంటూ మండిప‌డ్డారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. మహిళా శాసన సభ్యులు హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలని ఆదేశించారు. సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం అని స్ప‌ష్టం చేశారు సీఎం. అసెంబ్లీ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందన్నారు. పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్ లోనే అందరూ స్పందించాలన్నారు.
The post గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీ

దావోస్ : దావోస్ లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు 2026లో పాల్గొన్నారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు, తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి

APCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediatelyAPCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediately

APCC President YS Sharmila protested at Andhra Ratna Bhavan in Vijayawada on Wednesday demanding the immediate release of Arogya Sri funds in the wake of the government failing to pay Aarogyasri (NTR

గ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల ఏపీపై వ‌డ్డీల భారంగ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల ఏపీపై వ‌డ్డీల భారం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. గ‌త పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నాం అని ఆవేద‌న చెందారు. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూలు చేస్తున్నాం అన్నారు.