hyderabadupdates.com movies గాయపడ్డ సింహానికి ‘పెద్ది’ కండీషన్

గాయపడ్డ సింహానికి ‘పెద్ది’ కండీషన్

ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించాక మాట మీద ఉంటాయో లేదోననే గ్యారెంటీ ఎవరూ ఇవ్వలేని రోజులివి. బాహుబలి నుంచి ప్యారడైజ్ దాకా అందరిదీ ఒకే కథ, ఒకే వ్యథ. అందుకే చిన్న నిర్మాతలు అలర్ట్ గా ఉండటం మొదలుపెట్టారు. ఒకవేళ స్టార్ హీరోలు కనక హఠాత్తుగా తప్పుకుంటే మంచి స్లాట్లను తాము వాడుకునే విధంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇది తెలివైన ఎత్తుగడ. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహంకు అదే చేశారు.

మే 1 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. అయితే ఏప్రిల్ 30 పెద్ది అంత పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు కేవలం రెండు రోజుల గ్యాప్ లో గాయపడ్డ సింహం రావడం దానికే రిస్క్. ఈవెంట్ కు వచ్చిన దిల్ రాజు దానికి సంబంధించి ఓపెన్ క్లారిటీ ఇచ్చేశారు. ఏప్రిల్ 30 పెద్ది గ్రాండ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి థియేటర్లు ఇవ్వలేమని, తర్వాత తననే అందరూ అంటారని, కాబట్టి కండీషన్స్ అప్లై అంటూ ఓ వారం వాయిదాకు సిద్ధం కావాలని ముందే చెప్పారట.

ఇది మంచి నిర్ణయం. ఒకవేళ పెద్ది టైంకు వచ్చిందనా గాయపడ్డ సింహం ఈజీగా పోస్ట్ పోన్ చేసుకుంటుంది. దాని వల్ల బిజినెస్ కు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. ఇన్ కేస్ పెద్ది మళ్ళీ వాయిదా పడిందా చెప్పినట్టుగా తరుణ్ భాస్కర్ వచ్చేస్తాడు. మంచి డేట్ ని వదులుకోకుండా ఇలాంటి ఎత్తుగడలు ఓపెనింగ్స్, కలెక్షన్స్ పరంగా ప్లస్ అవుతాయి. ఇదొక్కటే కాదు పెద్ది వస్తుందో లేదోననే డౌట్ ఉన్న ఇతర ప్రొడ్యూసర్లు కూడా అనౌన్స్ మెంట్లకు రెడీ అవుతున్నారట.

ఇప్పటికి ఉన్న సమాచారమైతే పెద్ది ఎలాంటి డౌట్ లేకుండా వచ్చేస్తుంది. స్పెషల్ సాంగ్ ని వచ్చే వారం నుంచి షూట్ చేసే ప్లాన్ లో ఉన్న దర్శకుడు బుచ్చిబాబు మిగిలిన పనులను పరుగులు పెట్టిస్తున్నారు. విపరీతమైన అంచనాలు మోస్తున్న నేపథ్యంలో ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వదిలే టీజర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోతాయని ఇన్ సైడ్ టాక్.

Related Post

బస్సు ప్రమాదం.. పసిపాప పక్కనే ఆమె తల్లి!బస్సు ప్రమాదం.. పసిపాప పక్కనే ఆమె తల్లి!

కొద్ది రోజుల క్రితం కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మరువక తెలంగాణలోని చేవెళ్ల దగ్గర మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అతి వేగంతో ఢీకొట్టడంతో

Rishab Shetty’s Kantara Chapter 1 enters Rs 100 Cr club in Hindi
Rishab Shetty’s Kantara Chapter 1 enters Rs 100 Cr club in Hindi

Sandalwood actor-director Rishab Shetty’s Kantara Chapter 1, the prequel to the blockbuster fantasy drama Kantara, has surpassed a special milestone today. The film’s Hindi version has royally entered the Rs

Top 10 Hrithik Roshan Movies That Prove Why He’s Bollywood’s True SuperstarTop 10 Hrithik Roshan Movies That Prove Why He’s Bollywood’s True Superstar

Minutes to read: 3 min In Bollywood, few names combine charisma, skill, and sheer star power like Hrithik Roshan. From his big-budget blockbusters to his debut in Kaho Naa… Pyaar