hyderabadupdates.com movies ‘గుంపులో గోవిందా’.. పెట్రోల్ క్యూల వెనుక అసలు గేమ్?

‘గుంపులో గోవిందా’.. పెట్రోల్ క్యూల వెనుక అసలు గేమ్?

రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం, పెట్రోలియం అసోసియేషన్ క్లారిటీ ఇచ్చినా.. బంకుల వద్ద జనం బారులు తీరడం ఆగడం లేదు. నిజానికి మన దగ్గర ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, కానీ ఒక వింత పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. లేని డిమాండ్‌ను ఉన్నట్లుగా భ్రమపడటమే ఈ గందరగోళానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. కావాలని బ్యాక్ గ్రౌండ్ లో సరుకు చకచకా అమ్మేసుకోవలనే ప్లాన్ లో కొందరు బంక్ యజమానులు ఫేక్ న్యూస్ లు వైరల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

సాధారణంగా ఒక లోకల్ పెట్రోల్ బంక్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ సామర్థ్యం సుమారు 20,000 లీటర్లు ఉంటుంది. రోజుకు ఒక 500 మంది వచ్చి వంద, రెండు వందల రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటే, ఆ స్టాక్ కనీసం మూడు నాలుగు రోజుల పాటు హాయిగా వస్తుంది. కానీ ఎక్కడో ఎవరో చెప్పిన ‘రేపటి నుండి పెట్రోల్ దొరకదట’ అనే ఒక చిన్న ఫేక్ న్యూస్, వేలాది మందిని ఒకేసారి రోడ్డు మీదకు తెచ్చింది. ప్రతి ఒక్కరూ తమ ట్యాంకులను ఫుల్ చేయించుకోవాలని చూడటంతో, నాలుగు రోజులు రావాల్సిన స్టాక్ కేవలం నాలుగు గంటల్లోనే ఖాళీ అయిపోతోంది.

అంటే బంక్ దగ్గర ఒక పది మంది లైన్ లో నిలబడితే, పక్కన వెళ్లేవారు కూడా ఏదో అయిపోతుందనే భయంతో వచ్చి లైన్ లో నిలబడతారు. దీనివల్ల బంక్ యజమాని ‘నో స్టాక్’ బోర్డు పెట్టాల్సి వస్తుంది. ఆ బోర్డును చూసిన మరికొందరు ఇది నిజమైన కొరత అని ఫిక్స్ అయిపోయి మరింత పానిక్ అవుతున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు చాలా పక్కాగా ఉన్నాయి. ముంబై తీరానికి లక్ష టన్నుల ముడి చమురుతో కూడిన ట్యాంకర్లు సురక్షితంగా చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

అమెరికా ఇరాన్ యుద్ధ పరిస్థితుల వల్ల రేట్లు పెరగవచ్చనే ప్రచారం కూడా ఈ భయానికి ఒక కారణం. అయితే ప్రభుత్వం ఇప్పటికే మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని భరోసా ఇచ్చింది. అనవసరంగా పెట్రోల్ నిల్వ చేసుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది తప్ప, ఎవరికీ లాభం లేదు. ఈ విషయంలో వాహనదారులు ఎవరి మాటలో విని ఆందోళన చెందకుండా, వాస్తవాలను గమనించాలని ఇప్పటికే పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు.

గుంపులో గోవిందాలా అందరితో కలిసి భయపడటం కంటే, డేటా అండ్ ఫాక్ట్స్ తో ఆలోచించడం ముఖ్యమనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ఇంధన సమస్య లేదు. ఈ కృత్రిమ కొరతను సృష్టించింది కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో జనాలకు మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని మరికొందరు చెబుతున్నారు.

Related Post

Baahubali The Epic completes censor; official runtime revealedBaahubali The Epic completes censor; official runtime revealed

SS Rajamouli and Prabhas’ monstrous blockbusters Baahubali: The Beginning and Baahubali: The Conclusion are set to re-release as a single film titled Baahubali:The Epic on October 31 in multiple formats.

‘దావోస్ మ్యాన్ చంద్రబాబు’… సీఎంకు ప్ర‌శంస‌!‘దావోస్ మ్యాన్ చంద్రబాబు’… సీఎంకు ప్ర‌శంస‌!

దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు జ్యూరిచ్‌లో బిజీ బిజీగా గ‌డిపారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ ఫౌండర్ చైర్మన్ కిషోర్ లుల్లా తో సమావేశమైన ముఖ్యమంత్రి…ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో