hyderabadupdates.com movies ‘గుడ్’ ప్రమోషన్లు చేసుకోవాలి ‘కార్తీక్’

‘గుడ్’ ప్రమోషన్లు చేసుకోవాలి ‘కార్తీక్’

టైటిల్ లో బ్యాడ్ అని పెట్టుకున్నారు కానీ దానికి తగ్గట్టే ప్రమోషన్లలో బాగా వెనుకబడిపోయింది బ్యాడ్ బాయ్ కార్తీక్. శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు తప్పించి ఇంకెలాంటి పబ్లిసిటీ లేకపోవడంతో జనంలో దీని మీద అటెన్షన్ రావడం లేదు. రంగబలి తర్వాత రెండేళ్లకు పైగా కనిపించకుండా పోయిన నాగశౌర్యకు ఇది కంబ్యాక్ అవుతుందా లేదానే అనుమానాలు అభిమానుల్లో కాసింత ఎక్కువగానే ఉన్నాయి.

నిర్మాతలు చెబుతున్న దాని ప్రకారం దీని బడ్జెట్ ముప్పై కోట్ల దాకా అయ్యింది. అంత మొత్తం థియేట్రికల్ గా రావడం చాలా కష్టం. యునానిమస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే కొంతమేర గట్టెక్కే ఛాన్స్ ఉంది కానీ ట్రైలర్ చూస్తే ఆ నమ్మకం రాలేదు. నాగ శౌర్య కూడా దీని పట్ల ముభావంగానే కనిపిస్తున్నాడు. నిర్మాతతో ఏవో విభేదాలు వచ్చిన వైనం మాటల్లో చేతల్లో కనిపిస్తోంది. హారిస్ జైరాజ్ సంగీతం అందించినా అది ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదంటే ఏమనుకోవాలి.

బ్యాడ్ బాయ్ కార్తీక్ కన్నా చాలా చిన్న సినిమాలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ నువ్వా నేనాని ప్రమోషన్లలో పోటీ పడుతున్నాయి. ఇవి చూసి మొదటి రోజే జనం థియేటర్లను హౌస్ ఫుల్ చేయలేరు కానీ కనీసం రిలీజ్ రోజు టాక్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నమైతే చేస్తారు. బాగుందనే మాట వస్తే ఆటోమాటిక్ గా టికెట్లు కొంటారు. ఇలాంటివి నాగ శౌర్య టీమ్ చేయడం లేదు. సినిమానే మాట్లాడుతుందనే తరహాలో నెమ్మదిగా ఉన్నారు.

సరే మూడు రోజుల్లో ఫలితం ఎలాగూ తేలనుంది కానీ బాక్సాఫీస్ పరంగా చూస్తే ఏప్రిల్ లో రిలీజవుతున్న సినిమాలకు స్టార్ల తాకిడి లేకుండా మంచి గ్రౌండ్ దొరుకుతోంది, డెకాయిట్ ఓ మోస్తరుగా వాడుకుంది కానీ యునానిమస్ అయ్యుంటే అడివి శేష్ ని పట్టడం కష్టమయ్యేది. నాగ శౌర్య ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. ఎలాగూ కాంట్రావర్సీ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి స్మూత్ గా తప్పుకున్నారనే టాక్ మీడియాలో ఉంది. ఏమో బ్యాడ్ బాయ్ తనకు గుడ్ లక్ అవుతాడేమో చూడాలి.

Related Post

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చిన అనంతరం కూడా

అంబటిపై 36 కేసులు.. ఇప్పట్లో బయటకు రాలేరా?అంబటిపై 36 కేసులు.. ఇప్పట్లో బయటకు రాలేరా?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తిరుమల మహా ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక నేపథ్యంలో రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలం వాడిన మాజీ మంత్రి అంబటి

Twitterati react to rumored lovebirds Thalapathy Vijay and Trisha Krishnan’s first public appearance togetherTwitterati react to rumored lovebirds Thalapathy Vijay and Trisha Krishnan’s first public appearance together

Their public appearance comes at a time when speculation about their alleged relationship continues to attract attention. Recently, Thalapathy Vijay’s wife Sangeetha Sornalingam reportedly filed for divorce, bringing an end