hyderabadupdates.com Gallery గూగుల్ ఏఐ హబ్ తో మార‌నున్న విశాఖ ముఖ‌చిత్రం

గూగుల్ ఏఐ హబ్ తో మార‌నున్న విశాఖ ముఖ‌చిత్రం

గూగుల్ ఏఐ హబ్ తో మార‌నున్న విశాఖ ముఖ‌చిత్రం post thumbnail image

విశాఖపట్నం: విశాఖపట్నం అంటే మనకి స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది, బీచ్ గుర్తొస్తుంది, కానీ ఇక నుండి విశాఖపట్నం అంటే ఏఐ డేటా హబ్… గ్లోబల్ ఐటీ హబ్ గా పిలవ బడుతుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ సమీపాన తర్లువాడ వద్ద ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గూగుల్ ఏఐ హబ్ తో విశాఖ ముఖచిత్రం మారబోతోందని చెప్పారు. ఇది ఒక భూమిపూజ కాదు… భవిష్యత్తుకి పునాది, ఇది ప్రాజెక్ట్ కాదు ఒక జనరేషన్‌ని మార్చే మూవ్‌మెంట్ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైజింగ్ – ఇండియా లీడింగ్ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. కేంద్ర మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ భారతదేశ డిజిటల్ , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవాన్ని అసాధారణ వేగం, స్పష్టతతో నడిపిన డైనమిక్ లీడర్ అని కొనియాడారు. ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పట్టాలెక్కించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్, అదానీ గ్రూప్, భారతి ఎయిర్‌టెల్ సంస్థ లీడర్లు, భారత ప్రభుత్వ అధికారులు, ప్రతిష్ఠాత్మక ఇండస్ట్రీ పార్టనర్లు, విశాఖ యువత, ఉత్తరాంధ్ర ప్రజలకు, గూగుల్ కోసం భూములు ఇచ్చిన రైతులకు మంత్రి అభినందనలు తెలిపారు.
28 ఏప్రిల్ 2026… సరికొత్త చరిత్రకు పునాది. ఈ తేదీ రాసి పెట్టుకోండి. విశాఖపట్నం పేరు ఇకపై ప్రపంచం మొత్తం వినిపిస్తుందన్నారు నారా లోకేష్. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇక నుండి ఒక లెక్క. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ సిటీ… ఇక నుండి విశాఖ ఏఐ డేటా హబ్. ఇప్పటి వరకు గూగుల్‌లో విశాఖపట్నం గురించి సెర్చ్ చేశారు. ఇక నుండి గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో విశాఖపట్నం ఉంటుంది. వైజాగ్ లో ‘జి’ అంటే గూగుల్ అని గట్టిగా చెప్పాలి, వైజాగ్‌లో సౌండ్ చేస్తే దేశం మొత్తం వినిపించాలి. గూగుల్ రాకుండా అడ్డుకోవడానికి కేసులు వేసిన బ్యాచ్‌కి వినిపించాల‌ని అన్నారు నారా లోకేష్. రాష్ట్రంలో 5ఏళ్లపాటు విధ్వంస పాలన జరిగింద‌న్నారు. ఒక్క కంపెనీ రాలేదు. ఉన్న కంపెనీలను తరిమేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగిన కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు.. 2024లో ఒక ప్రభంజనం వచ్చింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర… స్టేట్ మొత్తం క్లీన్ స్వీప్. 94% స్ట్రైక్ రేట్‌తో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజు నుండే పెట్టుబడుల కోసం పరిగెత్తాం. అన్ని దేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్‌ని ప్రమోట్ చేశాం అన్నారు.
The post గూగుల్ ఏఐ హబ్ తో మార‌నున్న విశాఖ ముఖ‌చిత్రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Indigo: ఇండిగో విమానంలో గుండెపోటుతో వ్యక్తి మృతిIndigo: ఇండిగో విమానంలో గుండెపోటుతో వ్యక్తి మృతి

Indigo : జెడ్డా నుంచి శంషాబాద్‌ వస్తున్న విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. జెడ్డా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న 6ఈ68 ఇండిగో విమానం(6E68 Indigo flight)లో నగరంలోని అంబర్‌పేటకు చెందిన మహ్మద్‌ ఖాసీం(79)కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. మరికొద్ది

జీవ వైజ్ఞానిక వేదిక‌గా హైద‌రాబాద్ కావాలిజీవ వైజ్ఞానిక వేదిక‌గా హైద‌రాబాద్ కావాలి

హైద‌రాబాద్ : వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో జ‌ర‌గిన బయోఏషియా-2026 సదస్సు ను ప్రారంభించి ప్ర‌సంగించారు. జీవవిజ్ఞాన రంగానికి చెందిన

బ‌డ్జెట్ దేశ ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్ర‌తీక : నిర్మ‌లాబ‌డ్జెట్ దేశ ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్ర‌తీక : నిర్మ‌లా

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ లో ఆదివారం దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2026-27 బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. కీల‌క రంగాల‌కు వెసులుబాటు ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చ‌ట్టం అమ‌లులోకి రానుంద‌ని ప్ర‌క‌టించారు. ప్రాధాన్య‌తా