hyderabadupdates.com Gallery గోదావ‌రి పుష్క‌రాల కంటే పోల‌వ‌రం పూర్తి చేస్తాం

గోదావ‌రి పుష్క‌రాల కంటే పోల‌వ‌రం పూర్తి చేస్తాం

గోదావ‌రి పుష్క‌రాల కంటే పోల‌వ‌రం పూర్తి చేస్తాం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అన్నారు. అప్పుడు కృష్ణా డెల్టాకు నీటి సమస్య రాదన్నారు. గతంలో ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే గత పాలకుడు గోదాట్లో కలిపేశాడని ఆరోపించారు. రూ.440 కోట్లతో కట్టిన డయాఫ్రామ్ వాల్ ను ముంచేశాడని మండిప‌డ్డారు. ఇప్పుడు మళ్లీ కేంద్ర సహకారంతో రూ.1000 కోట్లతో చేపట్టి పూర్తి చేశాం అన్నారు సీఎం. కొందరు నిర్మించిన వాటిని మరికొందరు కూలుస్తుంటారని అన్నారు. మళ్లీ వాటి పునర్నిర్మాణం చేయటం జరుగుుతందని చెప్పారు. పోలవరం, అమరావతి రాజధానిని మళ్లీ పునర్నిర్మించే అవకాశం నాకు వచ్చిందన్నారు. రూ.4,660 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయకుండా విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశాం అన్నారు. భవిష్యత్తులోనూ కరెంటు చార్జీలను పెంచేది లేదన్నారు.
గత పాలకులు 9 సార్లు కరెంటు ఛార్జీలు వేసి రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం వేశారని ఆరోపించారు సీఎం. సోలార్ రూఫ్ టాప్‌తో ప్రోజ్యూమర్ అనే విధానాన్ని తీసుకు వస్తున్నాం అన్నారు. సామాన్యులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. గంజాయి రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అని పేర్కొన్నారు. హాస్టళ్లు, బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోలు మధ్యాహ్న భోజనం తదితర అంశాల్లో మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు సీఎం. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం అన్నారు. రూ.వెయ్యి కోట్ల ఆదాయం కోల్పోతున్నా ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామ‌ని తెలిపారు.
The post గోదావ‌రి పుష్క‌రాల కంటే పోల‌వ‌రం పూర్తి చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చేత‌కాని సీఎం తెలంగాణ రాష్ట్రానికి శాపంచేత‌కాని సీఎం తెలంగాణ రాష్ట్రానికి శాపం

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో తెలంగాణ‌కు ఎలాంటి కేటాయింపులు లేక పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇన్నిసార్లు

స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాంస‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాం

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఉద్దేశించి. ఆషామాషీగా ఐఏఎస్ లు కాలేర‌ని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా

Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్

    ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఉగ్రవాద ఘటనగా కేంద్రం పేర్కొంది. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని పునరుద్ఘాటించింది. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7