ఢిల్లీ : మొజాంబికన్ సామాజిక కార్యకర్త గ్రాకా మాచెల్ కు అరుదైన గౌరవం లభించింది. తనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ శాంతి బహుమతి దక్కింది. ఇదిలా ఉండగా గ్రాకా మాచెల్ విద్య , ఆరోగ్యంలో విశేషంగా కృషి చేశారు. 2025 ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని గెలుచుకున్నారు. ఆఫ్రికా, అంతకు మించి అణగారిన వర్గాలు , సామాజిక న్యాయంపై ఆమె ప్రభావాన్ని ఈ అవార్డు గుర్తిస్తుంది. 2025 సంవత్సరానికి గాను ఇందిరా గాంధీ శాంతి నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని మొజాంబికన్ హక్కుల కార్యకర్త గ్రాకా మాచెల్ కు ప్రదానం చేస్తున్నట్లు జ్యూరీ వెల్లడించింది. బుధవారం అవార్డుకు ప్రకటించిన జ్యూరీ తెలిపింది. క్లిష్ట పరిస్థితులలో విద్య, ఆరోగ్యం మరియు పోషకాహారం, ఆర్థిక సాధికారత, మానవతావాద రంగంలో ఆమె చేసిన అద్భుతమైన కృషికి గాను
ఈ అవార్డు కోసం ఎంపిక చేసినట్లు మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ అధ్యక్షతన ఉన్న అంతర్జాతీయ జ్యూరీ వెల్లడించారు. ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ , అభివృద్ధి బహుమతికి సంబంధించి రూ. కోటి నగదు, ప్రశంసా పత్రంతో కూడిన ట్రోఫీ బహూకరిస్తారు. మాచెల్ ఒక విశిష్ట ఆఫ్రికన్ రాజనీతిజ్ఞురాలు, రాజకీయ నాయకురాలు, మానవతావాదిగా గుర్తింపు పొందారు, ఆమె జీవితాంతం స్వయం పాలన, మానవ హక్కుల రక్షణ కోసం పోరాటంలో పాతుకు పోయిందని జ్యూరీ చైర్మన్ ప్రకటించింది.
The post గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
Categories: