hyderabadupdates.com Gallery గ్రేట్ డీల్ కాదు ఇండియాకు బ్లాక్ డీల్

గ్రేట్ డీల్ కాదు ఇండియాకు బ్లాక్ డీల్

గ్రేట్ డీల్ కాదు ఇండియాకు బ్లాక్ డీల్ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలోని మోదీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ప్ర‌ధాని దేశ ప‌రువును గంగ‌లో క‌లిపాడని ఆరోపించారు. జాతీయ ఉపాధి హ‌మీ ప‌థ‌క ప‌రిరక్ష‌ణ యాత్ర రాయ‌ల‌సీమ‌లో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా కార్న‌ర్ మీటింగ్ లో ష‌ర్మిలా రెడ్డి ప్ర‌సంగించారు. ప్ర‌ధాని మోదీ తీరు నామ్ నరేందర్..కామ్ సరెండర్ గా మారి పోయింద‌న్నారు. అమెరికా చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారాడ‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. జరిగింది గ్రేట్ డీల్ కాదు.. ఇండియాకు బ్లాక్ డీల్ అని ధ్వ‌జ‌మెత్తారు. దేశ రైతాంగానికి, పరిశ్రమల రంగానికి బ్లాక్ డేగా పేర్కొన్నారు.. అగ్రరాజ్యం బ్లాక్ మెయిల్ కి తలొగ్గి దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణం అన్నారు. ఈ డీల్ దేశ భవిష్యత్ కే పొంచి ఉన్న ప్రమాదం అని హెచ్చ‌రించారు ష‌ర్మిలా రెడ్డి.
సున్నా సుంకాలతో భారత మార్కెట్ ను అమెరికా ఉత్పత్తులు శాసించాయంటే స్వదేశీ ఉత్పత్తులకు ఇది మరణ శాసనమేనని హెచ్చ‌రించారు. మోడీ గ చేసిన బ్లాక్ డీల్ మన రూపాయి భవితవ్యాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. ఇండియా ఎగుమతులపై అమెరికా సుంకాలు 18 శాతం తగ్గిస్తే, ఆ దేశ దిగుమతులపై మోడీ సుంకాలు సున్నా చేయడం ఏంటి అని ప్ర‌శ్నించారు. మన దేశ ఉత్పత్తులపై మొన్నటి దాకా అమెరికా వేసిన పన్నులు కేవలం 5 శాతం లోపేన‌ని అన్నారు. 5 నుంచి 50 శాతం పన్నులు పెంచి, అందులో 18 శాతానికి కుదిస్తే ఇండియాకు ప్రయోజనం ఎలా అవుతుంది అని నిల‌దీశారు. మన దేశానికి భారీ లాభం ఎలా చేకూరింది అని మండిప‌డ్డారు. సుంకాలు తగ్గింపుతో భారత్ కి దక్కే ప్రయోజనం కంటే.. సున్నా సుంకాలతో అమెరికాకు మాత్రం 100 శాతం లాభం చేకూరుతుంద‌న్నారు.
The post గ్రేట్ డీల్ కాదు ఇండియాకు బ్లాక్ డీల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

2028 నాటికి ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు2028 నాటికి ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు

అమరావతి : హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి

Supreme Court: వాట్సప్‌ లేకపోతే అరట్టై వాడండి – సుప్రీంకోర్టుSupreme Court: వాట్సప్‌ లేకపోతే అరట్టై వాడండి – సుప్రీంకోర్టు

Supreme Court : వాట్సప్‌కు పోటీగా తీసుకొచ్చిన స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ ‘అరట్టై’ పేరు ఇటీవల నెట్టింట మార్మోగుతోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ (Supreme Court) దీని ప్రస్తావన వచ్చింది. వాట్సప్‌ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ

Amit Shah: హిడ్మా ఎన్‌ కౌంటర్‌ పై అమిత్‌ షా డెడ్‌లైన్‌Amit Shah: హిడ్మా ఎన్‌ కౌంటర్‌ పై అమిత్‌ షా డెడ్‌లైన్‌

    అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మృతిచెందాడు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారు.