hyderabadupdates.com movies ఘోరం: గన్ చూపించి మహిళ బట్టలు విప్పించారు..

ఘోరం: గన్ చూపించి మహిళ బట్టలు విప్పించారు..

ముంబైలోని ఓ కార్పొరేట్ ఆఫీసులో జరిగిన ఘటన వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. పదిమంది పని చేసే ఆఫీసు, ఒక మహిళ పాలిట నరకకూపంగా మారింది. 51 ఏళ్ల మహిళా బిజినెస్ ఉమెన్‌పై ఒక ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన సీనియర్ అధికారులు చేసిన అఘాయిత్యం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ వివాదం విషయంలో తుపాకీతో బెదిరించి, కొట్టి, బలవంతంగా బట్టలు విప్పించి వీడియోలు తీశారనే ఆరోపణలు పోలీసులను కూడా షాక్‌కు గురిచేస్తున్నాయి.

బాధితురాలు ఫోటో ఫ్రేమ్స్, గిఫ్టింగ్ బిజినెస్ చేస్తున్నారు. పని మీద మహాలక్ష్మి ఏరియాలోని ఆ ఫార్మా కంపెనీ ఆఫీసుకి వెళ్లారు. అక్కడే అసలు దారుణం జరిగింది. ఆఫీసులోని ఒక క్యాబిన్‌లో ఆరుగురు సీనియర్ ఆఫీసర్లు ఆమెను టార్గెట్ చేశారు. ఒక వ్యక్తి రివాల్వర్ వెనుక భాగంతో ఆమె భుజంపై, వీపుపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమె వేసుకున్న డ్రెస్ ని బలవంతంగా లాగేసి, తలకు తుపాకీ గురిపెట్టి చంపేస్తామని బెదిరించారని బాధితురాలు తెలిపారు.

ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళను, బట్టలు విప్పాలంటూ తుపాకీ చూపించి ఫోర్స్ చేశారట. ఆమె ఒంటిపై కేవలం లోదుస్తులు మాత్రమే ఉండేలా చేసి, ఆ దృశ్యాలను తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు. తమ మాట వినకపోతే, ఈ అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టి పరువు తీస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. ఒక బిజినెస్ ఉమెన్‌ని ఆఫీస్ గదిలో బంధించి ఇంత పైశాచికంగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.

కేవలం వీడియోలు తీయడమే కాదు, తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. లేదంటే దొంగ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. గతంలో కూడా ఆ కంపెనీకి చెందిన మరో ఆఫీసర్ తనపై నిరాధారమైన ఫిర్యాదులు చేశారని, అప్పటి నుంచి తనను మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపుల పర్వం తట్టుకోలేకే ఇప్పుడు ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది.

ఎన్.ఎం. జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపులు, ఐటీ చట్టం కింద పలు కఠిన సెక్షన్లు నమోదు చేశారు. 2023 జనవరిలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనపై ఇప్పుడు పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోంది.

Related Post

Balakrishna to Be Honoured at IFFI 2025 for Completing 50 Years in CinemaBalakrishna to Be Honoured at IFFI 2025 for Completing 50 Years in Cinema

The 56th International Film Festival of India (IFFI) is set to celebrate a landmark moment in Indian cinema as legendary Telugu actor and Padma Bhushan awardee Nandamuri Balakrishna will be

జగన్ పర్యటనలో అపశృతి.. కుప్పకూలిన కార్యకర్తజగన్ పర్యటనలో అపశృతి.. కుప్పకూలిన కార్యకర్త

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పరామర్శ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లిన సందర్భంగా, ఆయనను చూసేందుకు భారీగా చేరుకున్న కార్యకర్తల్లో ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. జగ్గయ్యపేట

వాహ్ పవన్.. వన్య ప్రాణులకు అంబులెన్సులువాహ్ పవన్.. వన్య ప్రాణులకు అంబులెన్సులు

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ శాఖకు అంబులెన్సులు, ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టు కింద మొత్తం 100 వాహనాలను