hyderabadupdates.com Gallery చంద్రబాబు సార‌థ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం

చంద్రబాబు సార‌థ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం

చంద్రబాబు సార‌థ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం post thumbnail image

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు దూరదృష్టి నాయకత్వం ఫలితమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన తరువాత రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యేలు వ్య‌వ‌సాయం, అనుబంధ శాఖ‌ల‌పై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి అచ్చెన్నాయుడు స‌మాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం నిజమైన స్వర్ణ యుగాన్ని పొందిందని, రైతులకు నేరుగా లాభాలు, ఆధునిక సాగు పద్ధతులు, పంటల మార్కెటింగ్ సౌకర్యాలు లాంటి సమగ్ర పథకాలు రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తున్నాయని తెలిపారు.
సీఎం చంద్రబాబు సంకల్పం, దృఢమైన నాయకత్వం ఫలితంగా ప్రతి పంటలోనూ, ప్రతి రైతులోనూ గర్వం, నమ్మకాన్ని పెంపొందిస్తూ, వ్యవసాయ రంగాన్ని అత్యాధునిక శిఖరాలకు చేరుస్తోందని అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్ర‌ధానంగా తీసుకుని, బీమా, రుణ సౌకర్యం, పరిశోధనాత్మక పద్ధతులు వంటి పథకాలను మరింత బలోపేతం చేసిందని, ప్రతి రైతు, వారి కుటుంబాలు దీని ద్వారా నేరుగా లాభాలు పొందుతున్నార‌ని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వికసిత భారత్–2047 లక్ష్యాలకు అనుసంధానంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమగ్ర ప్రగతి దిశగా తీసుకెళ్లి 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ప్రజల తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం “స్వర్ణాంధ్ర – 2047” ప్రణాళికను రూపొందించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
The post చంద్రబాబు సార‌థ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డిMinister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘‘ కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలడు. సుప్రీంకోర్టు తీర్పునకు

మ‌ర‌ణం లేని మ‌హా నాయ‌కుడు ఎన్టీఆర్మ‌ర‌ణం లేని మ‌హా నాయ‌కుడు ఎన్టీఆర్

హైదరాబాద్‌: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌, ఎంపీ పురందేశ్వరి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని

Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్‌Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్‌

    ఏపీ ఇండస్ట్రియల్‌ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్‌ మెక్‌ కేతో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా-ఇండియా స్టేట్‌ ఎంగేజ్‌మెంట్‌ అజెండాలో ఏపీని