hyderabadupdates.com movies చంద్రబాబుపై బండ్ల గణేష్ అభిమానం వెలకట్టలేనిది

చంద్రబాబుపై బండ్ల గణేష్ అభిమానం వెలకట్టలేనిది

చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేక వేడుక నిర్వహించిన బండ్ల గణేశ్, తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.

షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు ‘మహా పాదయాత్ర’ చేపట్టనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుపై తనకు ఉన్న అభిమానాన్ని, భక్తిని చాటుకునే భాగంగానే ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో, ఆయన ఎలాంటి మచ్చ లేకుండా విడుదల కావాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బండ్ల గణేశ్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఆ కోరిక నెరవేరిన నేపథ్యంలో, ఇప్పుడు మొక్కు తీర్చుకునే కార్యక్రమంగా ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్న బండ్ల గణేశ్, కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. బండ్ల గణేశ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుతో అనుబంధం ఉన్న కార్యక్రమం కావడంతో ఈ మహా పాదయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

Related Post

బుచ్చిబాబు… భలే అసాధ్యుడివయ్యాబుచ్చిబాబు… భలే అసాధ్యుడివయ్యా

పెద్ది ప్రమోషన్ల గేరు మార్చేందుకు దర్శకుడు బుచ్చిబాబు రెడీ అవుతున్నారు. వచ్చే వారం హైదరాబాద్ లో జరగబోయే ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ సందర్భంగా మొదటి పాటను రిలీజ్ చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. దీని కోసం ఒక ప్రత్యేక ప్రోమో

సందీప్ వంగ… ఈసారి బ్రేక్ ఎవరికి?సందీప్ వంగ… ఈసారి బ్రేక్ ఎవరికి?

సందీప్ రెడ్డి వంగ సినిమాలో నటించినా.. ఆ సినిమాకు సాంకేతిక సహకారం అందించినా.. వాళ్ల కెరీర్లు రాత్రికి రాత్రి మారిపోతుంటాయి. ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దేవరకొండ సహా చాలామందికి బ్రేక్ ఇచ్చాడు ఈ ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్. ఆ చిత్రాన్ని ‘కబీర్ సింగ్’ పేరుతో