అమరావతి : దేశ రాజకీయాలపై ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీ టీడీపీనేనని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇవాళ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆయన పార్టీ జెండా ఎగుర వేసి ప్రసంగించారు. ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా 35 వేల కిలోమీటర్లు చైతన్యరథ యాత్ర చేపట్ట్టి ప్రజలను కలిశారని గుర్తు చేశారు . రికార్డులు సృష్టించాలన్నా… తిరిగ రాయాలన్నా టీడీపీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అధినేతలు అని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను చూసే నాపై చాలా పెద్ద బాధ్యత ఉందని అర్థం చేసుకున్నానని చెప్పారు. చెప్పుకుంటూ పోతే ఓ రోజంత సమయం పట్టే స్థాయిలో ఎన్టీఆర్ సంక్షేమ కార్యక్రమాలు, పాలనా సంస్కరణలు తెచ్చారని అన్నారు.
చంద్రబాబు వయస్సు 75 కానీ ఆయన స్పీడ్ 25 అని పేర్కొన్నారు నారా లోకేష్. చంద్రబాబు సృష్టించిన రికార్డులను ఎవ్వరూ బద్దలు గొట్టలేరన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీడీపీ సత్తా చాటాం అన్నారు. సైకిల్ బ్రాండ్ అన్ని చోట్లా కనబడుతుందన్నారు. అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చే విషయంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో సీఎం చంద్రబాబుది ముఖ్య పాత్ర పోషించారని, అంతే కాకుండా దళితుణ్ని లోక్ సభ స్పీకరుగా చేసిన ఘనత సీఎందేనని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానన్న వాళ్లు.. అడ్రస్ లేకుండా పోయారన్నారు. కొన్ని పార్టీలు వాళ్ల స్వార్థం కోసం కార్యకర్తల చేతుల్లో కత్తులు పెడతాయి… కానీ చంద్రబాబు మాత్రం కార్యకర్తల చేతులకు పుస్తకాలిచ్చారని తెలిపారు నారా లోకేష్.
The post చరిత్ర సృష్టించాలన్నా టీడీపీ తోనే సాధ్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
చరిత్ర సృష్టించాలన్నా టీడీపీ తోనే సాధ్యం
Categories: