hyderabadupdates.com movies చ‌రిత్ర‌లో ఫస్ట్ టైమ్: బీఆర్ ఎస్ ఎంత వీకైందంటే!

చ‌రిత్ర‌లో ఫస్ట్ టైమ్: బీఆర్ ఎస్ ఎంత వీకైందంటే!

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భారత రాష్ట్ర సమితి ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. రాష్ట్రాన్ని సాధించామ‌ని, దశాబ్దాల ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామ‌ని చెప్పుకొనే ఆ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కలేదు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ ఎస్ తీవ్ర నిరాశనే ఎదుర్కొంది. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

ఆ తర్వాత వచ్చిన కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా బీఆర్ ఎస్ తన సిట్టింగ్ స్థానం అయిన మాగంటి గోపీనాథ్ స్థానాన్ని కోల్పోయింది. తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షంగా నిలబడాలని భావించినా, అక్కడ కూడా పెద్ద షాక్ తగిలింది. కేవలం 13 మునిసిపాలిటీలను మాత్రమే గెలుచుకుంది. గత వైభవంతో పోలిస్తే ఇది పార్టీకి గణనీయమైన వెనుకడుగు అని చెప్పాలి.

2021లో జరిగిన మునిసిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ దూకుడుగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఖమ్మం వంటి బలమైన ప్రాంతంలో కూడా పరాజయం ఎదురవడం పార్టీని రక్షణాత్మక స్థితిలోకి నెట్టింది. గెలుపు ఆశించిన కొన్ని ప్రాంతాల్లో కూడా ఫలితాలు ఆశించిన విధంగా రాలేదు.

13.. 13..!

బీఆర్ ఎస్ అభ్యర్థులు 13 మునిసిపాలిటీల్లో పాగా వేశారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మరో 13 మునిసిపాలిటీల్లో ఒక్కో అభ్యర్థి మాత్రమే గెలిచారు. ఇవి ఎల్లారెడ్డి, సుల్తానాబాద్, యాదగిరిగుట్ట, వడ్డేపల్లి, పెద్దపల్లి, మధిర, కొడంగల్, నందికొండ, మంథని, హాలియా, చొప్పదండి, భూత్పూర్, ఆత్మకూరు ప్రాంతాలు.

ఈ ఫలితాలు బీఆర్ ఎస్ ప్రస్తుత స్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇకపై పార్టీ భవిష్యత్తు వ్యూహం ఎలా ఉండబోతుందో, ఈ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో చూడాల్సి ఉంది.

Related Post

7 Best Hollywood Thrillers on Netflix and Prime Video: From Bird Box to The Platform7 Best Hollywood Thrillers on Netflix and Prime Video: From Bird Box to The Platform

Cast: Maika Monroe, Karl Glusman Director: Chloe Okuno Language: English Genre: Thriller, Mystery Release date: 3 June 2022 Julia (Maika Monroe) moves to Bucharest with her husband, Francis (Karl Glusman).

RRR వచ్చి నాలుగేళ్లయినా…RRR వచ్చి నాలుగేళ్లయినా…

దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ ‘RRR’ విడుదలై అప్పుడే నాలుగేళ్లు గడిచిపోయాయి. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఈ చిత్రం, ఆస్కార్ వరకు వెళ్లి చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు