హీరో రాంచరణ్ వేసిన చికిరి చికిరి స్టెప్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే..! ఎ. ఆర్. రెహమాన్ సంగీతంలో రూపొందిన ‘చికిరి చికిరి’ పాట, రామ్ చరణ్ డ్యాన్స్ మూవ్స్ తోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్వరలోనే పాట యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ కి చేరేలా ఉంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ ఇండియా లోని ఆడియన్స్, ఇతర దేశాలకు చెందిన మూవీ లవర్స్, ఇలా ప్రతీ ఒక్కరు ఈ పాటకు చిందులు వేస్తున్నారు. ఈ పాటకు వేసిన స్టెప్స్ ప్యాన్స్ కూడా పెద్ద చర్చ జరుగుతోంది. చికిరి స్టెప్ లాంటి ఒక చిన్న వ్యాయామంతో తో గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. చికిరి చికిరి స్టెప్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ స్టెప్ లో చిన్నగా కాళ్లను కదలిస్తూ, చేతులను మెల్లగా మూవ్ చేస్తారు.
అయితే ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆక్సిజన్ సరఫరా సమానంగా జరిగి హార్ట్ రేట్ స్థిరంగా పెరుగుతుందని అంటున్నారు. గుండెకు అవసరమైన వ్యాయామం జరగడం వల్ల గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. చికిరి పాటతో జిమ్ లో స్టెప్పులు వేస్తున్న వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇటువంటి స్టెప్పులు వైద్యుల సూచనలతో మాత్రమే వేయాల్సి ఉంటుంది.