hyderabadupdates.com movies చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం లేదు. వీళ్ళు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించినా జెన్ జీ కిడ్స్ లో అత్యధిక శాతం వాటిని చూసి ఉండరు. ఎందుకంటే అవన్నీ 1980 కన్నా ముందు రిలీజైనవి కాబట్టి.

వాళ్ళకు ఈ కలయిక విక్రమ్ ప్లస్ జైలర్ లాగా కనిపిస్తోంది కాబట్టే సోషల్ మీడియాలో ఇంత ఊపు కనిపిస్తోంది. అయితే ఇప్పుడీ ప్రకటన టాలీవుడ్ సినీ ప్రియులు, అభిమానుల నుంచి కొత్త డిమాండ్ వచ్చేలా చేస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్ కలయిక. ఇది కావాలని అడుగుతున్నారు ఫాన్స్.

చిరు, బాలయ్య నట ప్రస్థానం గత అయిదు దశాబ్దాలుగా కొనసాగుతోంది. స్నేహితులుగా మంచి బాండింగ్ ఉన్నప్పటికీ కలిసి నటించే చొరవ మాత్రం ఎప్పుడూ తీసుకోలేదు. సరైన కథతో ఏ దర్శకుడు ముందుకు రాకపోవడం వల్లనో ఏమో అరుదైన ఈ కాంబినేషన్ ఇన్నేళ్లు కలగా ఉండిపోయింది.

మొన్నటి ఏడాది బాలయ్య స్వర్ణోత్సవం జరిగినప్పుడు తమ ఇద్దరి కాంబోలో కథ రాస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నామని స్టేజి మీద చిరంజీవి ప్రకటించేశారు. బోయపాటి శీను, అనిల్ రావిపూడి తదితరులకు ఛాలెంజ్ విసిరారు.

దానికి సానుకూల సంకేతాలు ఇద్దరి మొహాల్లో కనిపించాయి. అయితే వినడానికి ఎంత ఉద్వేగంగా అనిపించినా ప్రాక్టికల్ గా ఈ జంటని కలపడానికి ఎవరో ఒక దర్శకుడు పూనుకోవాలి. నెటిజెన్ల నుంచి రాజమౌళి, సందీప్ వంగా, అనిల్ రావిపూడి , బోయపాటి శీను ఇలా వివిధ పేర్లు వినిపిస్తున్నాయి కానీ ముందైతే కథ సిద్ధం కావాలి.

సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి కలిసి అరాచకం చేస్తే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ సాక్షి ఆ రికార్డులు బద్దలైపోయి నిరూపించాలి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి గుండమ్మ కథ, మాయాబజార్, చాణక్య చంద్రగుప్త లాంటి ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ లో తెరను పంచుకున్నారు. తిరుగులేని ముద్ర వేశారు.

అలాంటి ఇంపాక్ట్ చిరంజీవి, బాలకృష్ణ సృష్టించాలి. మన శంకరవరప్రసాద్ గారులో చిరు, వెంకీ ఒక పావు గంట సందడి చేశారు కానీ ఫుల్ లెన్త్ రోల్స్ లో ఇద్దరు సీనియర్లను చూస్తే వచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. షోలే లాంటి టెర్రిఫిక్ సబ్జెక్ట్ ఎవరో ఒకరు రెడీ చేయాలి.

ఇప్పటి తరం స్టార్లలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చేసి ఆస్కార్ స్థాయి సినిమాలో భాగమైనప్పుడు చిరు, బాలయ్య ఇక ఆలస్యం చేయకుండా చేతులు కలిపే పనికి పూనుకోవాలి. అభిమానులు అప్పుడే ఏఐ వాడి రకరకాల పోస్టర్లు సృష్టించేస్తున్నారు. మరి ఈ స్వప్నాన్ని నిజం చేసే రచయిత, దర్శకుడు ఎవరో వీలైనంత త్వరగా బయటికి రావాలి. రాబోయే రోజుల్లోనైనా తెలుగు అభిమానుల ఈ కళ నెరవేరుతుందో లేదో చూడాలి.

Related Post

ఫ్యామిలీ మ్యాన్-3ని అలా ముగించారేంటి?ఫ్యామిలీ మ్యాన్-3ని అలా ముగించారేంటి?

ఇండియాస్ మోస్ట్ లవ్డ్ సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ తివారి.. మళ్లీ బుల్లెతెరల్లోకి వచ్చేశాడు. మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రలో రాజ్-డీకేల ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ నుంచి మూడో సీజన్ శుక్రవారమే స్ట్రీమింగ్‌కు వచ్చింది. గత రెండు సీజన్ల టెంపోను మూడో

చెత్త‌-స‌త్తా.. తేల్చుకుందాం: కేటీఆర్‌చెత్త‌-స‌త్తా.. తేల్చుకుందాం: కేటీఆర్‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మ‌రో ఐదు రోజుల స‌మ‌య‌మే ఉన్న నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటింటి ప్ర‌చారం, ప్ర‌సంగాలు చేసుకున్న నాయ‌కులు.. తాజాగా ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో