hyderabadupdates.com Gallery చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్ post thumbnail image

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన‌ ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు భారీ స్కోరు సాధించింది. రికార్డ్ బ్రేక్ చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి దిగిన భార‌త ఓపెన‌ర్లు దుమ్ము రేపారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. నిన్న‌టి దాకా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న అభిషేక్ శ‌ర్మ స‌త్తా చాటాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఇక కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. త‌ను 46 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో 89 ర‌న్స్ చేశాడు. భారీ స్కోర్ సాధించ‌డంలో కీల‌క భూమిక పోషించాడు. ఇంకో వైపు అభిషేక్ శ‌ర్మ త‌క్కువ తిన‌లేదు. త‌ను 21 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 52 ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీ చేశాడు.
ఇంగ్లండ్ తో జ‌రిగిన సెమీస్ లో ఆడిన భార‌త జ‌ట్టునే తిరిగి ఫైన‌ల్ మ్యాచ్ లో కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. ఇక సంజూ శాంస‌న్ అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ ఫార్మాట్ లో సంజు సామ్సన్ వరుసగా రెండు నాకౌట్ మ్యాచ్‌లలో, సెమీఫైనల్ , ఫైనల్‌లో యాభై పరుగులు చేశాడు. గతంలో విరాట్ కోహ్లీ , షాహిద్ అఫ్రిది మాత్రమే ఈ ఘనతను సాధించారు. అభిషేక్ అవుట్ అయ్యాక మైదానంలోకి వ‌చ్చిన ఇషాన్ కిష‌న్ సూప‌ర్ షో చేశాడు. త‌ను కూడా ఉతికి ఆరేశాడు. 25 బాల్స్ ఎదుర్కొని 54 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక ఆఖ‌రులో వ‌చ్చిన శివ‌మ్ దూబే శివాలెత్తాడు. త‌ను కేవ‌లం 8 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 26 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఇండియా 5 వికెట్లు కోల్పోయి 255 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ ముందు 256 ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.
The post చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్

హైద‌రాబాద్ : టిజీ విశ్వ ప్ర‌సాద్, కీర్తి ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ది రాజా సాబ్. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు మారుతి. అయితే ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా. పాన్ ఇండియా స్థాయిలో తీసినా ఆశించినంత

కేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మేకేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మే

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి, త‌న తండ్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స‌ర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ నోటీసులు

బ‌హుళ సౌక‌ర్య కేంద్రాలుగా స‌హ‌కార సంఘాలుబ‌హుళ సౌక‌ర్య కేంద్రాలుగా స‌హ‌కార సంఘాలు

అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో 2021 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో (PACS) 2017 సంఘాలు 62.34 కోట్ల రూపాయల వ్యయంతో వ-PACS గా మార్పు చెందాయ‌న్నారు. ఇవి డిజిటల్ విధానంలో