hyderabadupdates.com Gallery చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్ post thumbnail image

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా గురువారం ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన 2వ‌వ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు భారీ స్కోరును న‌మోదు చేసింది. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. ఆట ఆరంభం నుంచే దాడి చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఫోర్లు సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌ను కేవ‌లం 42 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 89 కీల‌క‌మైన ప‌రుగులు చేశాడు. భారీ స్కోరులో ముఖ్య భూమిక పోషించాడు. ఇందులో 8 ఫోర్లు 7 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. త‌ను 9 ప‌రుగులు చేశాడు.
అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన ఇషాన్ కిష‌న్ 18 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 39 ర‌న్స్ కొట్టాడు. ఆ త‌ర్వాత శివమ్ దూబే శివాలెత్తాడు. త‌ను 25 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 4 సిక్సులు బాదాడు . 43 ప‌రుగులు చేశాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ 11 ర‌న్స్ చేయ‌గా హార్దిక్ పాండ్యా చుక్క‌లు చూపించాడు. త‌ను 3 ఫోర్లు 2 సిక్సుల‌తో 26 ర‌న్స్ చేస్తే , తిల‌క్ వ‌ర్మ కేవలం 7 బంతులు ఎదుర్కొని 3 భారీ సిక్స్ ల‌తో 27 ప‌రుగులు చేశాడు. దీంతో ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టు ముందు 254 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ముందు ఉంచింది టీం ఇండియా. ఇక పొట్టి క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ లో భార‌త జ‌ట్టు అత్య‌ధిక స్కోర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.
The post చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: మంగళంలోని ఎర్రచందనం గోదాములో డిప్యూటీ సీఎం పవన్‌ తనిఖీPawan Kalyan: మంగళంలోని ఎర్రచందనం గోదాములో డిప్యూటీ సీఎం పవన్‌ తనిఖీ

    తిరుపతి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించి

మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలిమెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

తిరుప‌తి : టీటీడీ జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. గురువారం ఆయన ఆక‌స్మికంగా

Minister Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడుMinister Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడు

    విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అక్కడి నేవీ అధికారుల చేతిలో బందీలు అయిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. డిల్లీలో ఉన్న కేంద్ర పౌర