hyderabadupdates.com Gallery చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్ post thumbnail image

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా గురువారం ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన 2వ‌వ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు భారీ స్కోరును న‌మోదు చేసింది. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. ఆట ఆరంభం నుంచే దాడి చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఫోర్లు సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌ను కేవ‌లం 42 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 89 కీల‌క‌మైన ప‌రుగులు చేశాడు. భారీ స్కోరులో ముఖ్య భూమిక పోషించాడు. ఇందులో 8 ఫోర్లు 7 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. త‌ను 9 ప‌రుగులు చేశాడు.
అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన ఇషాన్ కిష‌న్ 18 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 39 ర‌న్స్ కొట్టాడు. ఆ త‌ర్వాత శివమ్ దూబే శివాలెత్తాడు. త‌ను 25 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 4 సిక్సులు బాదాడు . 43 ప‌రుగులు చేశాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ 11 ర‌న్స్ చేయ‌గా హార్దిక్ పాండ్యా చుక్క‌లు చూపించాడు. త‌ను 3 ఫోర్లు 2 సిక్సుల‌తో 26 ర‌న్స్ చేస్తే , తిల‌క్ వ‌ర్మ కేవలం 7 బంతులు ఎదుర్కొని 3 భారీ సిక్స్ ల‌తో 27 ప‌రుగులు చేశాడు. దీంతో ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టు ముందు 254 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ముందు ఉంచింది టీం ఇండియా. ఇక పొట్టి క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ లో భార‌త జ‌ట్టు అత్య‌ధిక స్కోర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.
The post చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్

చెన్నై : ఐసీసీ టోర్న‌మెంట్ లో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ రేపు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే భార‌త్, జింబాబ్వే జ‌ట్లు ఎవ‌రికి వారే ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఇప్ప‌టికే తీవ్ర నిరాశ‌కు గురి చేశారు అభిషేక్ శ‌ర్మ‌, ఇత‌ర

దేశం గ‌ర్వించ ద‌గిన మాన‌వుడు అంబేద్క‌ర్దేశం గ‌ర్వించ ద‌గిన మాన‌వుడు అంబేద్క‌ర్

అమ‌రావ‌తి : ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశం గ‌ర్వించ ద‌గిన మాన‌వుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ అని అన్నారు. అంబేద్క‌ర్ 135వ జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళులు

జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలే : ప‌య్యావుల కేశ‌వ్జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలే : ప‌య్యావుల కేశ‌వ్

విజ‌య‌వాడ : టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలప లేదన్న వైఎస్సార్‌సీపీ వాదనలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్. ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామిపై