hyderabadupdates.com movies ‘ఛాంపియన్’ జోడికి సక్సెస్ చాలా అవసరం

‘ఛాంపియన్’ జోడికి సక్సెస్ చాలా అవసరం

డిసెంబర్ 25 విడుదల కాబోతున్న ఛాంపియన్ మీద ఇంతకు ముందు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణ ప్రేక్షకులకు కాన్సెప్ట్ ఏంటో ఐడియా వచ్చింది. పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ ఇంత గ్రాండ్ గా తెరకెక్కించారా అంటూ ఆశ్చర్యపోయినవాళ్ళే ఎక్కువ. ఎంత స్వప్న, వైజయంతి సంస్థల ప్రొడక్షన్ అయినప్పటికీ కేవలం ఒక్క సినిమా అనుభవమున్న హీరో రోషన్ మేక మీద ఇంత ఖర్చు పెట్టడం విశేషమే. అఖండ 2 వైఫల్యం తర్వాత బాక్సాఫీస్ వద్ద వ్యాక్యూమ్ ఏర్పడిన నేపథ్యంలో దాన్ని వాడుకుంటే ఛాంపియన్ కు ఓపెనింగ్స్ తో పాటు మంచి వసూళ్లు దక్కుతాయి.

ఇదంతా బాగానే ఉంది కానీ ఛాంపియన్ పబ్లిసిటీలో హీరోయిన్ అనస్వర రాజన్ కు తగినంత ప్రాధాన్యం దక్కిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. గిర గిర పాటలో వేసిన ఒక స్టెప్ తో వైరల్ అయిపోయింది. ప్రమోషన్స్ లోనూ రోషన్ ను డామినేట్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు.

మలయాళం నుంచి వచ్చిన ఆమె మనకు కొత్త కానీ మల్లువుడ్ లో చాలా సినిమాలే చేసింది. ఓటిటి కంటెంట్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు సూపర్ శరణ్యలో తన పెర్ఫార్మన్స్ గుర్తుండే ఉంటుంది. ఇదే కాదు చాలా హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. ఐఫా, ఫిలిం ఫేర్ లాంటి పురస్కారాలు వరించాయి. అనస్వర రాజన్ కమిట్ మెంట్ ఏ స్థాయిలో ఉందంటే తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పుకుంది. ఈ విషయం మొన్న ఈవెంట్ లో రామ్ చరణ్ స్వయంగా చెప్పాడు.

ఇప్పుడు కనక ఛాంపియన్ బ్రేక్ ఇస్తే అనస్వర రాజన్ కు తెలుగులో మంచి వెల్కమ్ దక్కుతుంది. పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ మేకకు ఇది హిట్ కావడం చాలా అవసరం. లక్కీగా అనస్వర రాజన్ లాంటి నటించే అమ్మాయి దొరకడం ఒక రకంగా లక్ అని చెప్పాలి. పెళ్లి సందడితో పరిచయమైన శ్రీలీల ఎంత బిజీ ఆర్టిస్ట్ అయ్యిందో చూస్తున్నాం. ఇప్పుడీ అనస్వరకు అలాంటి బ్రేక్ దొరుకుతుందేమో చూడాలి. స్వాతంత్రం రాక ముందు, వచ్చిన తర్వాత తెలంగాణలోని భైరాన్ పల్లి అనే గ్రామంలో నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ ఛాంపియన్ తెరకెక్కించారు.

Related Post

సౌండ్ లేదేంటి వరప్రసాద్ గారూసౌండ్ లేదేంటి వరప్రసాద్ గారూ

మాములుగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఓటిటిలో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో మంచి హడావిడి ఉంటుంది. కానీ మన శంకరవరప్రసాద్ నెల రోజులకే డిజిటల్ లో వచ్చినా దాని తాలూకు సౌండ్ సోషల్ ఆన్ లైన్లో పెద్దగా లేదు. థియేటర్లలో రిలీజైనప్పుడు

బౌలింగ్ ఇవ్వలేదని బ్యాట్ తో కోపాన్ని చూపించాడా?బౌలింగ్ ఇవ్వలేదని బ్యాట్ తో కోపాన్ని చూపించాడా?

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ పర్ఫార్మర్ వాషింగ్టన్ సుందర్. అయితే, ఈ మ్యాచ్‌లో సుందర్ ఆడిన విధానం చూస్తే, బౌలింగ్ ఇవ్వలేదన్న కోపాన్ని బ్యాటింగ్‌పై చూపించాడా అని ఫ్యాన్స్

Kantara: A Legend Chapter 1 Review: An Engaging Tale with a Mix of Divine Elements and HighsKantara: A Legend Chapter 1 Review: An Engaging Tale with a Mix of Divine Elements and Highs

Movie Name: Kantara: A Legend Chapter 1Rating: 3.25/5Cast: Rishab Shetty, Rukmini Vasanth, Gulshan Devaiah, Jayaram, and othersDirector: Rishab ShettyProduced By: Hombale FilmsRelease Date: 2nd October 2025 With much anticipation from audiences across languages, Kantara: