hyderabadupdates.com Gallery జ‌గ‌న్ రెడ్డికి విమ‌ర్శించే అర్హ‌త లేదు : స‌విత‌

జ‌గ‌న్ రెడ్డికి విమ‌ర్శించే అర్హ‌త లేదు : స‌విత‌

జ‌గ‌న్ రెడ్డికి విమ‌ర్శించే అర్హ‌త లేదు : స‌విత‌ post thumbnail image

అమ‌రావ‌తి : సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ విమర్శించడంపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవాలయం లాంటి శాసనసభలో తల్లి లాంటి భువనేశ్వరిని జగన్, ఆయన బ్యాచ్ అవమానించిందన్నారు. సొంత చెల్లికి, తల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. బాబాయ్ కూతురైన మరో చెల్లి న్యాయం చేయాలని అడిగినా పట్టించు కోకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్న ప్రబుద్ధుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి, పులివెందులలో మహిళలపై జరిగిన అత్యాచారాలను, దారుణాలను ప్రజలంతా చూశారన్నారు. రాజధాని అమరావతి ప్రాంత మహిళల పట్ల జగన్ ఏవిధంగా ప్రవర్తించాడో ఎవరూ మరిచి పోలేదన్నారు. ప్రశ్నించిన మహిళలపై కేసులు పెట్టి వేధించిన చరిత్ర ఆయనదన్నారు. ఆయన హయాంలో జరిగిన విధ్వంసం, ఘోరాలపై ఆనాడే గవర్నర్ కు ఒక పుస్తక రూపంలో అందజేశామని గుర్తు చేశారు.
అయిదేళ్లలో బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై జగన్ భారం పెంచితే, తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి వెన్నదున్నుగా నిలిచిందన్నారు ఎస్. స‌విత‌. జగన్ మహిళా ద్రోహి అని మంత్రి సవిత విరుచుకుపడ్డారు. అయిదేళ్ల పాలనలో దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా జగన్, ఆయన బ్యాచ్ కాలం గడిపిందని మంత్రి మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదని స్పష్టంచేశారు. అయిదేళ్లలో రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టారా… చెరువులను నీటితో నింపారా..? అని ప్రశ్నించారు. రాయలసీమను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబు దేనన్నారు. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్, పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జగన్ ఓర్వలేక పోతున్నారని, డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
The post జ‌గ‌న్ రెడ్డికి విమ‌ర్శించే అర్హ‌త లేదు : స‌విత‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. మిథున్‌ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్

ISRO: సీఎమ్‌ఎస్‌-3 ప్రయోగానికి ఇస్రో సిద్ధంISRO: సీఎమ్‌ఎస్‌-3 ప్రయోగానికి ఇస్రో సిద్ధం

ISRO : భారీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. 4,410కిలోల అత్యంత బరువైన సీఎమ్‌ఎస్‌-3 (సమాచార) ఉపగ్రహాన్ని ఆదివారం కక్ష్యలోకి చేర్చనుంది. భారత భూభాగం నుంచి గతంలో ఎన్నడూ ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపిన చరిత్ర లేదు. దీంతో ‘బాహుబలి’గా పిలిచే

అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్

సెరియా : ప్ర‌పంచ టెన్నిస్ రంగంలో అత్యంత పాపుల‌ర్ ఆటగాడు సెరియాకు చెందిన నోవాక్ జ‌కోవిచ్. ఇప్ప‌టికే రికార్డ్ స్థాయిలో గ్లాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. మ‌రో రికార్డ్ కు చేరువ‌లో ఉన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్