hyderabadupdates.com Gallery జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌

జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌

జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌ post thumbnail image

విజ‌య‌వాడ : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గ‌త 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో నిర్వీర్యం చేశాడ‌ని ఆరోపించారు. అందుకే జ‌నం ఛీ కొట్టార‌ని, కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని అయినా బుద్ది రావ‌డం లేద‌ని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అటువంటి దారుణాలు ఎక్కడ జరిగాయో మీరు చూపించాలని అన్నారు. రోడ్లపైకి వచ్చి రౌడీ లాగా దాడులు చేస్తే అరెస్టులు చేయకూడదా? అని ప్ర‌శ్నించారు బుద్దా వెంక‌న్న‌. ఉచ్చ నీచాలు మరచి మాట్లాడిన వారిపై కేసులు పెడితే అరాచకమా అని నిల‌దీశారు. నా తండ్రి సమకాలికుడు చంద్రబాబు అని ఈరోజు జగన్ వ్యాఖ్యానించడం దారుణ‌మ‌న్నారు. ఇదేం సంస్కారం అని, బుద్ధి ముందు నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి కి ఇంత ఘోర ఓటమి ఉండేది కాద‌న్నారు.
జగన్ అధికారంలో ఉండగా కొడాలి నాని, ద్వారంపూడి వంటి వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటే నువ్వేం చేసావ్ జగన్ అంటూ ఫైర్ అయ్యారు. వారిని నిరోధించాల్సిన జగన్ ముసి ముసిగా నవ్వుకుంటూ వాళ్లను ప్రోత్సహించారని ఆరోపించారు బుద్దా వెంక‌న్న. దేవత లాంటి భువనేశ్వరిని ఎన్ని మాటలు ఎప్పుడన్నారో ఆనాడే టిడిపికి ఓటు వేయాలని ప్రజల నిర్ణయించుకున్నారని అన్నారు. వాళ్లు నోరు పారేసుకున్న రోజే ఖండించి ఉంటే బాగుండేదన్నారు. భువనేశ్వరి అమ్మ కూడా నా తల్లి వయసు లాంటిది చెప్పాల్సి ఉందన్నారు. ఇప్పుడు మాత్రం చిలక పలుకులు పలుకుతున్న జగన్ కు ఆరోజు ఇటువంటి సంస్కారం ఎందుకు గుర్తు రాలేన్నారు.
The post జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్

Martlet Missiles : భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే మరో అధునాతన అస్త్రం చేరనుంది. రక్షణరంగంలో పరస్పర విస్తృత సహకారం కోసం భారత్‌-యూకే మధ్య కీలకమైన ఒప్పందం జరిగింది. దీనికింద తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ ‘మార్ట్‌లెట్‌’ (Martlet Missiles)లను

తిరుప‌తి లాగా మేడారం ఆలయాన్ని అభివృద్ది చేస్తాంతిరుప‌తి లాగా మేడారం ఆలయాన్ని అభివృద్ది చేస్తాం

వ‌రంగ‌ల్ జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప – లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని అన్నారు.

Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీBihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ

Bihar Assembly Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు