hyderabadupdates.com Gallery జగన్ హ‌యాంలో మొత్తం క‌ల్తీనే : ఎస్. స‌విత

జగన్ హ‌యాంలో మొత్తం క‌ల్తీనే : ఎస్. స‌విత

జగన్ హ‌యాంలో మొత్తం క‌ల్తీనే : ఎస్. స‌విత post thumbnail image

శ్రీసత్యసాయి జిల్లా : జగన్ హయాంలో అన్ని కల్తీలే జరిగాయని, చివరికి తిరుపతి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. ఆయన్ను ప్రజలెప్పుడూ నమ్మరని, వైసీపీకి ఎప్పుడో పాడి కట్టేసి శవయాత్ర నిర్వహించారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉనికి కోసం జగన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధే సీఎం చంద్రబాబు విజన్ కు నిదర్శనమన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో వడిగేపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి గంధం చంద్రుడు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు మంత్రి సవిత పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
119 ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మందికి రూ.2,717 కోట్ల మేర ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో 2.63 లక్షల మందికి రూ.115 కోట్లు, పెనుకొండలో 40 వేల మందికి రూ.17 కోట్లు, గోరంట్ల మండలంలో 11 వేల మందికి రూ.4.29 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వడిగేపల్లి పంచాయతీలో 462 మందికి రూ.20 లక్షలు పింఛన్ల రూపంలో అందజేశామన్నారు. వడిగేపల్లి పంచాయతీలో ఇప్పటికే రూ.50 లక్షలతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, రూ.43 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టమన్నారు. రూ.21 లక్షలతో సిరి కల్చర్, గోకులం షెడ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. దీపం–2 పథకం కింద 1,240 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 529 మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.27 లక్షలు జమ చేశామన్నారు. తల్లికి వందనం పథకం కింద పంచాయతీలోని 268 మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో రూ.47 లక్షలు జమ చేశామని తెలిపారు. త్వరలో రూ.31 లక్షలతో గ్రామ ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని వెల్లడించారు.
The post జగన్ హ‌యాంలో మొత్తం క‌ల్తీనే : ఎస్. స‌విత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టుNalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టు

Nalgonda Police : అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మేర మోసానికి పాల్పడిన నిందితుడిని నల్గొండ (Nalgonda Police) జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు విలువైన కార్లు, ఆస్తి పత్రాలు, బాధితులకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు,

తిల‌క్ వ‌ర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ ల‌కు నో ఛాన్స్తిల‌క్ వ‌ర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ ల‌కు నో ఛాన్స్

ముంబై : హైద‌రాబాద్ కు చెందిన తిల‌క్ వ‌ర్మ‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఓపెన‌ర్ గా ఛాన్స్ ఇచ్చినా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంసన్ వ‌రుస‌గా న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్

క‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లుక‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లు

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర సీమ‌లో టాప్ హీరోగా పేరు పొందిన టీవీకే పార్టీ చీఫ్ త‌ళ‌ప‌తి విజ‌య్ కి బిగ్ షాక్ త‌గిలింది. తాను చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌మిళ‌నాడులోని క‌రూర్ లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట