hyderabadupdates.com Gallery జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళం

జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళం

జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం, జన‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీకి సంబంధించి క్రియాశీల‌క స‌భ్య‌త్వ నమోదు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న వంతుగా రూ. 2 కోట్లు విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తొలి స‌భ్య‌త్వాన్ని తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా గుర్తిస్తామ‌ని అన్నారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా స‌త్క‌రిస్తామ‌న్నారు డిప్యూటీ సీఎం. జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
150 మందితో పార్టీని ప్రారంభించామ‌ని తెలిపారు. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90 వేలు నమోదు చేశామ‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఎన్నికల ముందు ఆ సంఖ్య ఆరు లక్షలకు చేరిందన్నారు. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించామ‌ని తెలిపారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునే వారు, చదువుకున్న వారు ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని చెప్పారు డిప్యూటీ సీఎం. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వారు మనకు ముఖ్యం అన్నారు. అలాంటి వారే పార్టీకి అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ , పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
The post జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజాPakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజా

      పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ భారత్‌పై మరోసారి ఉద్రిక్త వాఖ్యలు చేశారు. భారత్ తో యుద్ధం జరిగే అంశాన్ని కొట్టిపారేయలేమని ఒకవేళ పూర్తిస్థాయిలో యుద్ధం వస్తే ఎదుర్కొవడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉండాలన్నారు. ఇటీవలే భారత ఆర్మీ

Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా 

Palla Srinivasarao : విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి తాను కూర్చున్న స్టేజి కూలిపోయిన ఘటన వెనుక ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉందని శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే

దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటుదేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు

అన‌కాప‌ల్లి : అన‌కాప‌ల్లి నియోజ‌వ‌ర్గంలోని పాయ‌క‌రావుపేట‌లో భారీ ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆర్సెలార్ మిట్ట‌ల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మాట్లాడారు. ఏపీలో ఓ భారీ స్థాయి స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ