hyderabadupdates.com Gallery జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం

జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం

జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం post thumbnail image

విశాఖ‌పట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ కొణిద‌ల గురువారం విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. త‌న తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించ‌చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు వెల్ల‌డించారు. జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ను ప్రారంభించారు.
జూపార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ ని అడిగి తెలుసుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. జంతు శాలల్లో ఆహారం అందించేందుకు వెళ్లే సమయాల్లో జూ నిబంధనలు పాటించారు. కంబాలకొండ ఎకో పార్క్ లో నగర వనాన్నికూడా ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఎకో పార్క్ లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గం మధ్యలో మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జంతువుల సంర‌క్ష‌ణ అనేది ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త కావాల‌ని పిలుపునిచ్చారు. ఆయా సంస్థ‌లు సామాజిక బాధ్య‌త‌గా భావించాల‌ని సూచించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల.
The post జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Wedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహంWedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం

    పచ్చని పెళ్లి పందిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురిని మెట్టినింటికి పంపాల్సిన ఓ తండ్రి కాటికి చేరాడు. కూతురి పెళ్లి కోసం సరుకులు తీసుకురావడానికి వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో కూతురు పెళ్ళి కోసం

గాడి త‌ప్పిన పాల‌న కేటీఆర్ ఆందోళ‌నగాడి త‌ప్పిన పాల‌న కేటీఆర్ ఆందోళ‌న

హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న‌కు తెలిసిన పాలన కేవలం ఇళ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేయడమేనని కేటీఆర్ ఆగ్రహం

విజ‌య్ ఎన్డీఏ పొత్తుపై అన్నామ‌లై నో కామెంట్స్విజ‌య్ ఎన్డీఏ పొత్తుపై అన్నామ‌లై నో కామెంట్స్

చెన్నై : త‌మిళ‌నాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై టీవీకే పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్ పై కామెంట్స్ చేసేందుకు త‌న‌కు ఎలాంటి అధికారం లేద‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.