
జీ స్క్వేర్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టేలా ఒక అజెండా సిద్ధం అవుతోంది అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రియల్ ఎస్టేట్ ను నడిపించేందుకు వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు అని ఆరోపించారు.
ఈ జీ స్క్వేర్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్న స్థలం విషయంలో వివాదం ఉంది. ఆ స్థలంపై ఈడీ విచారణ జరుగుతోంది. అలాంటి చోట టీటీడీ ఆలయం కడతారా? చెప్పాలని ప్రశ్నించారు. శ్రీవారి ఆలయ మర్యాదలు టీటీడీ ఛైర్మన్ మంటగలుపుతున్నారన్నారు. మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి అక్కడ పరివట్టం, వేదాశీర్వచనం చేయడం ఆయన పదవిని దుర్వినియోగం చేయడమే… రేపు ఇంకెవరో కర్మక్రియల రోజు వేదాశీర్వచనం ఇమ్మని కోరడం రివాజు అయితే దానికి బీఆర్ఎస్ నాయుడు సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు.
ఏటి సూతకం ఉన్న అదనపు ఈఓకి స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా వేద ఆశీర్వచనమిస్తూ, లడ్డూ ప్రసాదాలను అందించడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని మండిపడ్డారు.
The post జీ స్వ్కేర్‌లో టీటీడీ ఆలయమా? appeared first on Adya News Telugu.