hyderabadupdates.com Gallery జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్

జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్

జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్ post thumbnail image

తిరుపతి : ధర్మ మార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్ అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతిని పురస్కరించుకుని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామి వారి కృపకు పాత్రులయ్యారని చెప్పారు. ఇటువంటి పవిత్రమైన మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు వెయ్యికి పైగా భజన మండళ్ల సభ్యులు, ప్రముఖ సంగీత కళాకారులు భజనలు చేస్తూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించు కుంటారని చెప్పారు. మార్చి 15న ఆదివారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యాన వనంలో సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ అన్నమాచార్యుల వారి వర్ధంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు సింగపూర్ నుండి 20 మంది కళాకారులు స్వచ్ఛందంగా విచ్చేశారు. సింగపూర్‌కు చెందిన డా. కె. భాగ్యమూర్తి ఆధ్వర్యంలో “అష్టలక్ష్మి విద్యార్థుల బృందం” మెట్లోత్సవంలో పాల్గొంది.
అలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచార్య వంశీయులు మెట్ల పూజ నిర్వహించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం చేశారు. ఇందులో “బ్రహ్మ కడిగిన పాదము”, “భావములోన బాహ్యమునందును”, “ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు”, “పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమా”, “కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు” వంటి కీర్తనలు ఆలపించారు. భక్తులు పరవశించి గోష్టిగానంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు లత, అన్నమాచార్య వంశీయులు తాళ్లపాక హరి నారాయణాచార్యులు, ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు.
The post జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలుCM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

శ్రీ క‌ళ్యాణ శ్రీ‌వారి ఆల‌యంలో స్నపన తిరుమంజనంశ్రీ క‌ళ్యాణ శ్రీ‌వారి ఆల‌యంలో స్నపన తిరుమంజనం

తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్ప యాగానికి మార్చి 14వ తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. 15న పుష్పయాగం సందర్భంగా ఉదయం 10

పాల‌నా ప‌రంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హ‌రీశ్ రావుపాల‌నా ప‌రంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇవాళ హ‌రీశ్