hyderabadupdates.com Gallery జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్ post thumbnail image

అమ‌రావ‌తి : తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి అని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో అదే విధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సంక్రాంతి అనేది ప్రత్యేకంగా ఒక మతానికి నిర్దేశించిన పండుగ కాదని, మన సనాతన ధర్మ మూలాల్లో చెప్పే ప్రకృతి ఆరాధన పండుగ అన్నారు. ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, వైజ్ఞానిక పరమైన అంశాలు ఈ వేడుకలో దాగి ఉన్నాయని చెప్పారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. అప్యాయత, అనురాగాలకు నిలువుటద్దాలు. వాటి మూలలను, గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప కోడి పందాలు, పేకాట, ఇతర జూదాలను కాదని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మన మూలలను మనం మరిచిపోతే సంస్కృతి దారి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంక్రాంతి నుంచి కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి అనే మాటలు పోవాలని, శ్రమైక జీవన సౌందర్యానికి సంక్రాంతి వేదిక కావాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. శుక్రవారం పిఠాపురంలోని ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిఠాపురం చాలా కీలకమైన శక్తి పీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల ఇది. ఏ రోజు కూడా సినిమాల్లో నటించాలి, రాజకీయాల్లో పోటీ చేయాలని అనుకోలేదు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా ఊహించలేదు. అంతా ఆ భగవంతుడి సంకల్పం అని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.
The post జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గేఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గే

హైద‌రాబాద్ : యంగ్ హీరో, హీరోయిన్లు న‌వీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించిన తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రోజు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. ప‌లు సినిమాలు సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. మెగాస్టార్

100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్

అమ‌రావ‌తి : మోదీ స‌ర్కార్ కార్పొరేట్ల‌కు వంతం పాడుతూ కీల‌క‌మైన జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కానికి తూట్లు పొడి చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA) పరిరక్షణ

ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్

చెన్నై : 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్. సోమ‌వారం ఆయ‌న జెండాను ఆవిష్క‌రించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. తాము ఏక రూప భార‌త దేశాన్ని కోరుకోవ‌డం లేద‌ని అన్నారు.