hyderabadupdates.com movies జూబ్లీహిల్స్ లో ఆ పార్టీ వైపే కేకే సర్వే మొగ్గు

జూబ్లీహిల్స్ లో ఆ పార్టీ వైపే కేకే సర్వే మొగ్గు

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానంలో మరోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బరిలో ప్రధానంగా ఈ రెండు పార్టీలే ఉండడంతో బీజేపీపై పెద్ద అంచనాలు లేవు. ఈ క్రమంలోనే ఈ బైపోల్ రిజల్ట్స్ పై ఆసక్తికరమైన అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తారని కేకే సర్వే అంచనా వేసింది.

ఏరియాలవారీగా జరిపిన సర్వేలో గులాబీ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేకే సర్వే చెబుతోంది. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 12-13 శాతం మెజారిటీ వచ్చే చాన్స్ ఉందని చెప్పింది. శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డ, షేక్ పేట, బోరబండలో బీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తోందని, రహమత్ నగర్, వెంగళ్రావునగర్ లలో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉందని తెలిపింది.

గత ఎన్నికల్లో కేకే సర్వే చెప్పినట్లు ఏపీలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేకే సర్వేకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కేకే సర్వే చెప్పింది జరుగుతుందా లేదా అన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

Related Post