hyderabadupdates.com movies జై హనుమాన్ రెండేళ్ల తర్వాతేనా

జై హనుమాన్ రెండేళ్ల తర్వాతేనా

ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు. జై హనుమాన్ షూటింగ్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం . మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందించే ఈ విజువల్ గ్రాండియర్ అనౌన్స్ మెంట్ వచ్చి ఏడాది దాటిపోయింది.

కాంతార చాప్టర్ 1 వచ్చాక కూడా నెలల తరబడి అప్డేట్స్ లేకుండా పోయాయి. అప్పుడప్పుడు రిషబ్ శెట్టి దీని ప్రస్తావన తెచ్చినా ఫలానా టైంలో మొదలవుతుందని చెప్పలేదు. ఫైనల్ గా కోరుకున్న ముహూర్తం వచ్చేసింది. అయితే ఈ సందర్భంగా ఎన్నో ప్రశ్నలు మూవీ లవర్స్ మెదళ్లను ఆక్రమిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

మొదటిది ప్రశాంత్ వర్మకు సంక్రాంతి మీదే గురి. ఖచ్చితంగా ఆ పండగకే రిలీజ్ చేయాలని కంకణం కట్టుకుంటారు. అది నిజమైన పక్షంలో 2027 సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్,సెన్సార్ వగైరాలన్నింటికి సంవత్సర కాలం సరిపోదు. సో 2028కి షిఫ్ట్ అవ్వాలి.

కానీ అది మరీ దూరమైపోతుంది. ఓటిటి ఒప్పందాల టైంలో ఇబ్బంది తలెత్తవచ్చు. సో దానికన్నా ముందు వచ్చే ఆప్షన్ పరీశీలించినా ఆశ్చర్యం లేదు. రెండోది రాముడిగా ఎవరు నటిస్తారనేది. ప్రశాంత్ వర్మ పలువురు స్టార్లను కలిసి నెరేషన్లు ఇచ్చాడు కానీ ఫైనల్ గా ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది.

మూడోది తేజ సజ్జ ఇందులో ఉంటాడా లేదానేది అసలు క్వశ్చన్. అయితే లీగల్ గా హనుమాన్ సీక్వెల్ హక్కులు దాని అసలు నిర్మాతలు ప్రశాంత్ వర్మకు ఇవ్వడం లేదని సమాచారం. సో పూర్తిగా వేరే కథతో జై హనుమాన్ రాసుకున్నారని ఇన్ సైడ్ టాక్.

అదే నిజమైన పక్షంలో తేజ సజ్జతో అవసరం ఉండదు. అందులోనూ తేజ ఇప్పుడు సోలో హీరోగా మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. క్యామియోలు, స్పెషల్ రోల్స్ చేసే ఉద్దేశం లేదు. సో రిషబ్ శెట్టినే సోలోగా ఉంటాడు. రాముడిని గ్రాఫిక్స్ లో మేనేజ్ చేస్తే చెప్పలేం. మొత్తానికి స్టార్ట్ కాబోతున్న టైంలో జై హనుమాన్ మరోసారి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యేలా ఉంది.

Related Post

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయంబీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఈ విషయంపై ఏదో ఒకటి త్వరగా తేల్చాలని తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు

లోక తెలుగులో తీస్తే డిజాస్ట‌ర్!లోక తెలుగులో తీస్తే డిజాస్ట‌ర్!

మ‌ల‌యాళంలో బాక్సాఫీస్ రికార్డుల‌న్నీ కొల్ల‌గొడుతూ రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి సంచ‌ల‌నం రేపింది లోక‌-చాప్ట‌ర్ 1 సినిమా. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావ‌డం విశేషం. సౌత్ ఇండియాలో వ‌చ్చిన ఫ‌స్ట్ లేడీ ఓరియెంటెడ్ సూప‌ర్ హీరో మూవీ ఇది.

భారీగా త‌గ్గ‌నున్న కార్లు-దుస్తుల ధ‌ర‌లుభారీగా త‌గ్గ‌నున్న కార్లు-దుస్తుల ధ‌ర‌లు

యూరోపియ‌న్ దేశాలుగా పేరొందిన జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిట‌న్‌, స్విట్జ‌ర్లాండ్‌, నార్వే, స్పెయిన్‌, ఉక్రెయిన్‌, పోలాండ్ స‌హా 25 దేశాల నుంచి భార‌త్‌కు దిగుమ‌తి అయ్యే అన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. గ‌త ప‌దేళ్ల‌లో ఆయా దేశాలు.. 90