hyderabadupdates.com movies జోగి రమేశ్ బెయిల్ రద్దు తప్పదా?

జోగి రమేశ్ బెయిల్ రద్దు తప్పదా?

మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేేపిన సంగతి తెలిసిందే. వాడు వీడు అంటూ లోకేశ్ ను ఏకవచనంతో సంబోధించడమే కాకుండా…లోకేశ్ కు కొవ్వు తగ్గలేదు, లోకేశ్ మెదడుకు చిప్ దొబ్బింది అంటూ అసభ్యకర పదజాలంతో లోకేశ్ ను జోగి విమర్శించారు. దీంతో, ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు జోగి రమేశ్ ఇంటికి నిప్పు పెట్టి..ఇంటిని ధ్వసం చేశాయి.

అయినా సరే జోగి తీరు మారలేదు. తానేం తప్పు మాట్లాడాను? తానేం రెచ్చగొట్టాను అంటూ మీడియా ప్రతినిధులను జోగి రమేశ్ అడగడం ఆశ్చర్యకరంగా ఉంది. తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను జోగి రమేశ్ సమర్థించుకున్నారు.

ఇక, జోగి రమేశ్ పారిపోడని, మళ్లీ అరెస్టుకు సిద్ధమని పోలీసులకు పరోక్షంగా సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే జోగి రమేశ్ కు నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు షాకిచ్చారు. ఈ కేసులో జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముల బెయిల్ రద్దు చేయాలని విజయవాడ ఎక్సైజ్‌ కోర్టులో సిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

జోగి రమేష్ సోదరుల కండిషనల్ బెయిల్‌ రద్దు చేయాలని కోరింది. ఈ కేసులో జోగి బ్రదర్స్ కీలక నిందితులని, వారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని ఆ పిటిషన్ లో సిట్ పేర్కొంది. ఆ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశముంది. తాజాగా లోకేశ్ పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జోగి రమేశ్ బెయిల్ రద్దయి ఆయన మళ్లీ జైలుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Related Post

రియ‌ల్ జీవితాన్ని ముంచేస్తున్న `రీల్స్‌`!రియ‌ల్ జీవితాన్ని ముంచేస్తున్న `రీల్స్‌`!

సోష‌ల్ మీడియాల్లో రీల్స్ పిచ్చి ముదిరి పాకాన ప‌డుతోంది. ఇప్ప‌టికే రీల్స్ వ్య‌వ‌స్థ భ్ర‌ష్టు ప‌ట్టిపోయిందన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అస‌భ్య ప‌దాలు.. చ‌ర్య‌ల‌తో రీల్స్‌ను అనేక మంది ధ్వంసం చేస్తున్నారు. ఒక స‌దుద్దేశంతో రీల్స్‌ను తీసుకువ‌చ్చినా.. దీనిలో అస‌భ్య‌క‌ర‌, అభ్యంత‌రక‌ర కంటెంట్