hyderabadupdates.com movies టాక్సిక్ అయోమయం ఇంకొకరికి వరం

టాక్సిక్ అయోమయం ఇంకొకరికి వరం

కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి కమర్షియల్ సినిమాలు హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా సరే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కథ చెప్పిన విధానం నచ్చి నెలల తరబడి అలోచించి ఓకే చెప్పాడు. నిర్మాణం జరిగింది. షూటింగ్ దాదాపు అయిపోయింది. మార్చి 19 రావాల్సిన టాక్సిక్ జూన్ మొదటివారానికి వెళ్ళిపోయింది. సరే అప్పటికైనా వస్తుందా అంటే అనుమానమే అంటున్నాయి బెంగళూరు వర్గాలు.

టాక్సిక్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. చేతిలో కేవలం నలభై అయిదు రోజులు మాత్రమే ఉండటంతో అవన్నీ పూర్తి చేయడం అసాధ్యంగా తోస్తోందట. అందులోనూ కెవిఎన్ ప్రొడక్షన్స్ మీద జన నాయకుడు ఒత్తిడి విపరీతంగా ఉంది. ఏప్రిల్ 30 విడుదల చేయాల్సిన కెడి డెవిల్ తాలూకు వర్క్ కూడా హై ప్రెజర్ మీద నడుస్తోంది. ఈ కారణంగానే టాక్సిక్ మీద పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నట్టు వినిపిస్తోంది.

ఒకవేళ టాక్సిక్ కనక జూన్ 4 వదులుకుంటే దాన్ని లాగేసుకోవడానికి పెద్ది రెడీగా ఉన్నట్టు సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు కూడా అదే సూచిస్తున్నారట. ఎలాగూ లెనిన్ జూన్ 26 లాక్ చేసుకుంది కాబట్టి పెద్ది కనక ఫస్ట్ వీక్ లోనే వస్తే ఉభయ కుశలోపరిగా ఉంటుందనే కోణంలో ఆలోచన జరుగుతోందట. అయితే ఇది పాజిబుల్ అయ్యేది లేనిది దర్శకుడు బుచ్చిబాబు చేతిలో ఉంది. ఎందుకంటే ఐటెం సాంగ్ హీరోయినే ఇప్పటిదాకా ఎంపిక కాలేదు. ఏవేవో పేర్లు పుకార్లలోకి వచ్చేశాయి.

సరే టాక్సిక్ కనక మాట తప్పే పక్షంలో మళ్ళీ ఎప్పుడు రిలీజ్ ఉంటుందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. యష్ మాత్రం నెక్స్ట్ ఆగస్ట్ కి వెళ్ళిపోదామని అంటున్నాడట. అయితే అదే నెలలో జైలర్ 2, ది ప్యారడైజ్ ఉన్నాయి కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. వాటిలో ఏదైనా తప్పుకుంటే అప్పుడు ప్లస్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో టాక్సిక్ సోలో రిలీజ్ ఉండేలా చూసుకోమని యష్ చెబుతున్నట్టు సమాచారం. అదంత సులభం కాదు కానీ అసాధ్యం అయితే కాదు.

Related Post

Online Casinos and Esports: Where Does the Sport End and the Game Begin?Online Casinos and Esports: Where Does the Sport End and the Game Begin?

This decade, as with most, has been defined by the convergence of disparate worlds. The online gambling industry has been keeping pace with competitive esports. Both worlds are based on

13 Most Awaited Hollywood Films Releasing in 2026: From The Devil Wears Prada 2 to The Odyssey and Avengers: Doomsday13 Most Awaited Hollywood Films Releasing in 2026: From The Devil Wears Prada 2 to The Odyssey and Avengers: Doomsday

Cast: Timothée Chalamet, Zendaya, Florence Pugh, Anya Taylor-Joy, Josh Brolin, Rebecca Ferguson, Jason Momoa, Nakoa-Wolf Momoa, Ida Brooke, Robert Pattinson Director: Denis Villeneuve Language: English Genre: Epic, Space Opera, Science