hyderabadupdates.com movies టాక్సిక్ ఇష్టం మనోళ్లకే ఎక్కువ ఉంది

టాక్సిక్ ఇష్టం మనోళ్లకే ఎక్కువ ఉంది

ఇటీవలే విడుదలైన టాక్సిక్ టీజర్ మీద పాజిటివ్, నెగటివ్ రెండు రకాల రియాక్షన్లు సోషల్ మీడియాలో కనిపించాయి. వయొలెన్స్ ఎక్కువయ్యిందని కొందరు, యానిమల్ కెజిఎఫ్ స్ఫూర్తితో యాక్షన్ ఎపిసోడ్లు నింపేశారని మరికొందరు ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. యష్ రెండు షేడ్స్ లో కనిపించడమైతే ఆసక్తి రేపింది.

గతంలో రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ వివాదం రేపిన నేపథ్యంలో ఈసారి అలాంటివి లేకుండా జాగ్రత్త పడ్డారు దర్శకురాలు గీతూ మోహన్ దాస్. ఇదిలా ఉండగా వివిధ భాషల్లో వచ్చిన టీజర్ వ్యూస్ ఆసక్తికరమైన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టాక్సిక్ మీద మనకెంత ప్రేముందో చూపిస్తున్నాయి.

రెండు రోజులకు గాను టాక్సిక్ తెలుగు వెర్షన్ కు వచ్చిన వ్యూస్ 11 మిలియన్లు. విచిత్రంగా ఒరిజినల్ వెర్షన్ అయిన కన్నడలో నమోదయ్యింది మాత్రం 8.2 మిలియన్లే. హిందీలో అత్యధికంగా 24 మిలియన్ల వ్యూస్ రాగా, తమిళంలో 5.9 మిలియన్లు, మలయాళంలో అతి తక్కువగా 2.9 మిలియన్ల వీక్షణలు వచ్చాయి.

అంటే శాండల్ వుడ్ కన్నా ఎక్కువగా టాలీవుడ్ జనాలే టాక్సిక్ మీద ఇంటరెస్ట్ చూపిస్తున్నారనేది స్పష్టం. టాక్సిక్ రూపొందుతోంది బైలింగ్వల్ అయినా ప్రధాన భాష కన్నడనే. సమాంతరంగా హిందీ కూడా తీశారు. తెలుగుతో సహా ఇతర భాషల్లో డబ్బింగ్ రూపంలోనే రానుంది.

మార్చి 19 విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రమోషన్ల పరంగా ఎక్కువ ఆధారపడింది టీజర్ మీదే. ట్రైలర్ ని మార్చి రెండో వారంలో లాంచ్ చేస్తారు. దురంధర్ 2 రూపంలో చాలా పెద్ద పోటీ ఉన్న నేపథ్యంలో పబ్లిసిటీ చాలా కీలకం కానుంది.

మార్కో, యానిమల్ ఛాయల గురించి డిస్కషన్ జరుగుతోంది కాబట్టి ముందా ముద్ర చెరిగిపోయేలా టాక్సిక్ వేరే కంటెంట్ వదలాల్సిన అవసరమైతే ఉంది. అసలు హీరోయిన్లను ఇప్పటిదాకా ఏ వీడియోలోనూ చూపించలేదు. ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా అంచనాలు మారిపోతాయని దురంధర్ 2కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే మూవీగా అందరూ భావిస్తారని టీమ్ చాలా ధీమాగా ఉంది.

Related Post

This actor was initially cast for Sundeep Kishan’s role in Dhanush’s RaayanThis actor was initially cast for Sundeep Kishan’s role in Dhanush’s Raayan

Dhanush’s directorial venture Raayan became a massive blockbuster at the ticket windows, grossing over Rs. 150 crores. Apart from direction, the movie was also headlined by Dhanush. SJ Suryah, Sundeep