hyderabadupdates.com movies టాక్సిక్… భలే తెలివైన ఎస్కేప్

టాక్సిక్… భలే తెలివైన ఎస్కేప్

దురంధర్ 2తో ఫేస్ టు ఫేస్ తలపడదామని డిసైడైపోయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టుకున్న యష్ టాక్సిక్ కొద్దిరోజుల ముందు హఠాత్తుగా వాయిదా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని కారణంగా చెప్పుకున్నారు కానీ పోటీ వల్లే నిర్ణయం మార్చుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. అందులోనూ ప్రమోషన్లకు తగినంత సమయం లేకపోవడంతో యష్ బృందం వెనుకడుగు వేయక తప్పలేదు.

దీన్ని గ్రేటెస్ట్ ఎస్కేప్ అఫ్ ది డికేడ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దురంధర్ ది రివెంజ్ నమోదు చేస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ నోరెళ్లబెడుతోంది. కేవలం ప్రీమియర్ షోలకు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పన్నెండు కోట్లకు పైగా వసూలు కావడం ఊహించని రికార్డు. ఈ మూవీ మీద జనంలో విపరీతమైన ఆసక్తి ఉన్న మాట నిజమే కానీ అది ఈ స్థాయిలో అనేది బహుశా దర్శక నిర్మాతలైనా ఊహించారో లేదో.

ఒకవేళ టాక్సిక్ కనక మాట మార్చకుండా కాంపిటీషన్ కు సిద్ధపడి ఉంటే దారుణంగా ఎఫెక్ట్ అయ్యేది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలన్నీ దురంధర్ రివెంజ్ ఫీవర్ లో ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వైపు బయ్యర్లు ఈ సినిమా తప్ప వేరే షో వేసేందుకు ఇష్టపడటం లేదు. అందులోనూ 3 గంటల 55 నిమిషాల నిడివి కాబట్టి రోజుకు నాలుగు కంటే ఎక్కువ షోలకు ఛాన్స్ లేదు. అందుకే స్క్రీన్లు పెంచి కలెక్షన్లు రాబట్టుకునే ప్రయత్నాల్లో డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు.

ఈ సునామీని తట్టుకోవడం టాక్సిక్ కు ఖచ్చితంగా కష్టం అయ్యేది. అందులోనూ టీజర్ వచ్చి అంచనాలను విపరీతంగా పెంచలేకపోయింది. దీనికి కొన్ని కోర్టు వివాదాలు, సెన్సార్ చిక్కులు వచ్చే అవకాశం ఉన్నందున సావధానంగా వాటిని పరిష్కరించుకోవాలి.

టాక్సిక్ టీమ్ ఏకంగా జూన్ కు వెళ్ళిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కు ఈ రిస్క్ లేదు. టార్గెట్ చేసింది కేవలం తెలుగు మార్కెట్లనే కాబట్టి మంచి టాక్ వస్తే చాలు ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ వసూళ్ళలో గట్టెక్కిపోతుంది. మొత్తానికి టాక్సిక్ అయితే భలే తప్పించుకుందనేది ఎవరూ కాదనలేని ఓపెన్ కామెంట్.

Related Post

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా రూ. 11,770 పెరిగి రూ. 1,78,850కి చేరుకుంది. మరోవైపు వెండి

లెక్క తప్పిన కలర్ ఫోటో దర్శకుడులెక్క తప్పిన కలర్ ఫోటో దర్శకుడు

ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైనా కలర్ ఫోటోకు మంచి స్పందన వచ్చిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. కొత్త ప్రేమకథ కాకపోయినా తెరకెక్కించిన విధానంలో నిజాయితీ కనిపించడంతో ఆడియన్స్ ప్రశంసలు, వ్యూస్ అందజేశారు. ఏకంగా జాతీయ అవార్డు రావడమనేది ఎవరూ ఊహించనిది. దర్శకుడు