అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి సీఎస్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా 10 రోజుల పాటు మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా రోజుకు 5 షోలు వేసేందుకు కూడా అనుమతి ఇచ్చినట్ల తెలిపింది సర్కార్. పెరిగిన రేట్లకు సంబంధించి చూస్తే సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 , మల్టీప్లెక్సుల్లో రూ.125 పెంచుకునేందుకు ఓకే చెప్పింది. మార్చి 19న బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది. ఈ షో టికెట్ ధర రూ. 500 కావడం తో ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ తగలనుంది.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్, శ్రీలీల నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసి U/A సర్టిఫికేట్ పొందింది. ఇక తెలంగాణలో తయారీదారులు టికెట్ల పెంపు లేకుండా సాధారణ జీఓ ధరలకు కట్టుబడి ఉంటారు. మార్చి 18న ప్రీమియర్ షోలు కూడా ఉండవు. ఇక 19వ తేదీ ఉదయం నుండి షోలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్ థియేటర్లు ఉదయం 4–5 గంటల నుండి షోలను ప్లాన్ చేస్తుండగా, తెలంగాణ థియేటర్లు ఉదయం 7 గంటల నుండి షోలను ప్రారంభిస్తాయి. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ . 2012 బ్లాక్‌బస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ , పవన్ తో కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది.
The post టికెట్ రేట్ల పెంపు పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
టికెట్ రేట్ల పెంపు పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్
Categories: