hyderabadupdates.com Gallery టీడీపీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం..బ‌ల‌గం : సీఎం

టీడీపీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం..బ‌ల‌గం : సీఎం

టీడీపీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం..బ‌ల‌గం : సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని, బ‌ల‌గ‌మ‌ని పేర్కొన్నారు సీఎం, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు. గ‌తంలో ఏపీని పాలించిన జ‌గ‌న్ రెడ్డి రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఆరోపించారు. రాజకీయాలను దాటి సామాన్య ప్రజల్ని నాటి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. 2019-24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తు చేయాల‌న్నారు. మనం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడంతో పాటు కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం పడే కష్టాన్ని ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌న్నారు. టీడీపీలో కార్యకర్తలే అధినేతలు అని పేర్కొన్నారు. రైట్ రాయల్‌గా బతకాలన్నారు. పార్టీ కూడా కార్యకర్తలను అంతే గౌరవిస్తుందని స్ప‌ష్టం చేశారు సీఎం.
కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలని కార్య‌క‌ర్త‌ల‌ను హెచ్చ‌రించారు. కిల్లర్ పార్టీ ఆలోచనా విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని సూచించారు. వైసీపీ నేత‌లు రోడ్ల మీదకు వస్తారు. రెచ్చగొడతారు. రప్పా రప్పా అంటారు. ప్రజలను ఇబ్బందులు పెడతారు. చర్యలు తీసుకుంటే రాజకీయమంటారంటూ మండిప‌డ్డారు. అన్యాయం జరిగిందని పరామర్శకు వెళ్తారు… కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపేస్తారు… కానీ తన కారు కింద పడిపోయిన కార్యకర్తను మాత్రం పరామర్శించరంటూ ఎద్దేవా చేశారు జ‌గ‌న్ రెడ్డిని ఉద్దేశించి. కడపలో సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారని, కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.
The post టీడీపీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం..బ‌ల‌గం : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Red Fort Blast: దిల్లీ ఘటనలో కొత్త కోణం ! డిసెంబర్‌ 6న భారీ పేలుళ్లకు కుట్ర ?Red Fort Blast: దిల్లీ ఘటనలో కొత్త కోణం ! డిసెంబర్‌ 6న భారీ పేలుళ్లకు కుట్ర ?

    దిల్లీ ఎర్ర కోట సమీపంలో పేలుడుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న భద్రతా సంస్థలు.. అనేక కోణాల్లో సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో కీలక విషయం వెల్లడైంది. డిసెంబర్‌ 6న (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు)

APCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediatelyAPCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediately

APCC President YS Sharmila protested at Andhra Ratna Bhavan in Vijayawada on Wednesday demanding the immediate release of Arogya Sri funds in the wake of the government failing to pay Aarogyasri (NTR

తెలంగాణ నుంచి కేసీఆర్ ను విడ‌దీయ‌లేరుతెలంగాణ నుంచి కేసీఆర్ ను విడ‌దీయ‌లేరు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని , ఆయ‌న లేకుండా రాష్ట్రాన్ని ఊహించ లేమ‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి త‌న ఆన‌వాళ్లు చెరిపి వేయాల‌ని చూస్తున్నాడ‌ని, కానీ ఆయ‌న ఆట‌లు సాగ‌వ‌న్నారు.