hyderabadupdates.com movies టీవీ పెళ్లిపై ట్రోల్స్… హీరోయిన్ ఏమందంటే?

టీవీ పెళ్లిపై ట్రోల్స్… హీరోయిన్ ఏమందంటే?

చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్‌గా దేశవ్యాప్తంగా అవికా గోర్ ఎంత పేరు సంపాదించిందో తెలిసిందే. ఆ గుర్తింపుతోనే ఆమె హీరోయిన్ కూడా అయింది. తెలుగులో దాదాపు 20 సినిమాల దాకా నటించింది. హిందీలో కూడా ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది. మధ్యలో తెలుగు సినిమాలకు కొంత కాలం దూరమైన ఆమె.. బాగా బరువు తగ్గి నాజూగ్గా తయారై వచ్చింది. ఆ తర్వాత ఆమె మళ్లీ అవకాశాలు పెరిగాయి.

పెద్ద సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా.. చిన్న చిత్రాలకు మాత్రం లోటు లేదు. ఇలా కెరీర్ బాగానే సాగుతున్న టైంలో అవికా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్నేళ్లుగా రిలేేషన్‌షిప్‌లో ఉన్న మిలింద్‌నే ఆమె పెళ్లి చేసుకుంది. కానీ ఆ వివాహం మామూలుగా జరగలేదు. ఒక రియాలిటీ షోకు వెళ్లి అక్కడ పెళ్లి చేసుకుంది అవికా. దీని మీద విమర్శలు తప్పలేదు.

అవికా పెళ్లిని కూడా కమర్షియల్ చేసేసిందని.. డబ్బు కోసమే ఈ మార్గాన్ని ఎంచుకుందని సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పలేదు. దీనిపై అవికా తాజాగా స్పందించింది. తాను డబ్బు కోసం ఇలా చేయలేదని.. తనకు లైఫ్ ఇచ్చింది టీవీనే అని.. అందుకే టీవీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవాలన్నది తన చిన్ననాటి కోరిక అని ఆమె చెప్పింది.

‘‘టీవీ షోలో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మిలింద్‌కు చెప్పినపుడు అతను ఓకే అన్నాడు. కానీ జనం నుంచి విమర్శలు వస్తాయి కదా అన్నాడు. డబ్బు కోసమే అలా చేస్తున్నామని అంటారేమో అని సందేహించాడు కూడా. కానీ నేను పర్వాలేదన్నాను. ఈ నిర్ణయంపై మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. అనుకున్నట్లే ట్రోల్స్ వచ్చాయి. కొందరు నా వెడ్డింగ్ లుక్ మీదా విమర్శలు గుప్పించారు. కానీ ఆ ట్రోల్స్ మిలింద్ మీద వస్తే ఫీలయ్యేదాన్ని. ఎందుకంటే తన లుక్ డిజైన్ చేసింది నేనే. మిగతా విషయాల్లో ఏమీ బాధ లేదు’’ అని అవికా చెప్పింది. ఓ హిందీ రియాలిటీ షోలో సెప్టెంబరు 30న వీరి పెళ్లి ఆడంబరంగా సాగింది.

Related Post

అఖండ తాండవానికి అదొక్కటే సమస్యఅఖండ తాండవానికి అదొక్కటే సమస్య

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18 వేల బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోవడం శుభపరిణామం. రేపటికి ఈ నెంబర్ లో గణనీయమైన మార్పు రానుంది. ఏపీ

Location recce wrapped for Ravi Teja’s next; Foreign schedule starts todayLocation recce wrapped for Ravi Teja’s next; Foreign schedule starts today

Mass Maharaja Ravi Teja joined hands with director Kishore Tirumala for a film tentatively titled #RT76. The project, produced by Sudhakar Cherukuri under the SLV Cinemas banner, is being made