hyderabadupdates.com Gallery టీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదు

టీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదు

టీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదు post thumbnail image

చెన్నై : అస‌లైన కాంగ్రెస్ పార్టీ త‌మ‌తోనే ఉందంటూ కామెంట్స్ చేసిన టీవీకే పార్టీ అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ పై నిప్పులు చెరిగారు కర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే త‌ను ఇలా మాట్లాడాడ‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ విజ‌య్ కు హిత‌వు ప‌లికారు డిప్యూటీ సీఎం. ప్ర‌జ‌లు ఎవ‌రు ఏమిటనేది గ‌మ‌నిస్తూ వుంటార‌ని, అందుకు అనుగుణంగా పొలిటిక‌ల్ లీడ‌ర్లు ఆచితూచి మాట్లాడాల‌ని అన్నారు. నోటికి వ‌స్తే అది మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు డీకే శివ‌కుమార్.
టీవీకే పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ ఒక అపరిపక్వ రాజకీయ నాయకుడంటూ ఎద్దేవా చేశారు. అతనికి రాజకీయ పరిణితి లేదని మండిప‌డ్డారు డిప్యూటీ సీఎం. బహుశా అతనితో ఆ టీఎంసీ ఉండ‌వచ్చంటూ పేర్కొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏనాడూ త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ప్ర‌క‌టించ లేద‌న్నారు. ఈ విష‌యం బ‌హిరంగంగానే తెలియ చేసింద‌న్నారు. అయితే రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌లు ఎప్పుడూ కొన‌సాగుతూనే ఉంటాయ‌ని, ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు డీకే శివ‌కుమార్. త‌మ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రం ఎంకే స్టాలిన్ సార‌థ్యంలోని డీఎంకే పార్టీతోనే క‌లిసి ఉంద‌ని, ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ప‌క్కా మెజారిటీ వ‌స్తుంద‌ని, మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు డిప్యూటీ సీఎం
The post టీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

కేర‌ళ : యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో అభిషేక్ శ‌ర్మ‌తో పాటు సంజు శాంస‌న్ పాల్గొన్నాడు.

SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదలSSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల

  ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసింది. ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి.

మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్

హైద‌రాబాద్ : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న‌తార , టీవీకే గ‌ణేష్ కీల‌క పాత్ర‌లు పోషించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. పాజిటివ్