hyderabadupdates.com movies ట్రైలర్ టాక్: మోస్ట్ లవ్డ్ మ్యాన్ ఈజ్ బ్యాక్

ట్రైలర్ టాక్: మోస్ట్ లవ్డ్ మ్యాన్ ఈజ్ బ్యాక్

ఇండియన్ వెబ్ సిరీస్ హిస్టరీలో ది బెస్ట్ ఏదంటే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే ఎక్కువమంది సమాధానం ఇస్తారు. థ్రిల్స్‌కు, థ్రిల్స్.. ఎంటర్టైన్మెంట్‌కు ఎంటర్టైన్మెంట్.. ఈ రెండు విధాలా ఈ సిరీస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 2019లో వచ్చిన తొలి సీజన్ సూపర్ హిట్ అయితే.. 2021లో రిలీజైన సెకండ్ సీజన్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. రెండో సీజన్ ఎండింగ్‌లోనే మూడో సీజన్‌కు లీడ్ ఇచ్చారు. 

కానీ అది సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు గత ఏడాది దీన్ని మొదలుపెట్టి రాజ్-డీకే.. చకచకా పూర్తి చేసి ఈ నెల 21న స్ట్రీమింగ్‌కు రెడీ చేశారు. అమేజాన్ ప్రైమ్ మరోసారి ఇండియాస్ మోస్ట్ పాపులర్ సిరీస్‌ను స్ట్రీమ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో ‘ఇండియాస్ మోస్ట్ లవ్డ్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అంటూ ట్రైలర్ వదిలింది.

తొలి రెండు సీజన్లలో ఫ్యామిలీకి తెలియకుండా సీక్రెట్‌గా ఆపరేషన్లు చేసిన ఏజెంట్ శ్రీకాంత్ తివారి.. ఈసారి కుటుంబానికి తన గురించి చెప్పేయాల్సిన పరిస్థితి వస్తుంది. తాను ఒక ఏజెంట్ అని చెబితే.. కొడుకు ‘‘ట్రావెల్ ఏజెంటా’’ అని అడగడంతో ట్రైలర్ మొదలైంది. తర్వాత తాను సీక్రెట్ ఏజెంట్ అని చెబితే.. నీకు ‘‘టైగర్.. లయన్.. పఠాన్’’ ఇలాంటి కోడ్ నేమ్ ఉందా అని కొడుకు అడగడం.. ‘‘ఇదేమైనా సర్కసా’’ అని మనోజ్ షాకవ్వడం.. ఇలా భలే ఎంటర్టైనింగ్‌గా సాగిందీ ఈ సీన్. 

దేశం కోసం ప్రాణాలొడ్డి ఎన్నో ఆపరేషన్లు చేసిన శ్రీకాంత్ మీదే దేశద్రోహిగా ముద్ర పడడం.. పోలీసులు తన వెంట పడడం.. అతను కుటుంబంతో కలిసి పారిపోయి తలదాచుకునే ప్రయత్నం చేయడం.. అదే సమయంలో తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఛేదించే పనిలో పడి ఒక ఆపరేషన్ చేపట్టడం.. ఇలా థ్రిల్లింగ్ అంశాలకూ లోటు లేనట్లే ఉంది ‘ఫ్యామిలీ మ్యాన్-3’. గత రెండు సీజన్ల మాదిరే.. థ్రిల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్‌తో అలరించేలా ఉన్న ‘ఫ్యామిలీ మ్యాన్-3’ ఈ నెల 21 నుంచి ఇండియన్ స్ట్రీమింగ్ రికార్డ్స్ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Post

OTT: Manchu Lakshmi’s crime investigation thriller Daksha now streaming on Prime VideoOTT: Manchu Lakshmi’s crime investigation thriller Daksha now streaming on Prime Video

Manchu Lakshmi was recently seen in the crime investigation thriller Daksha. Before the release, a controversial interview featuring Manchu Lakshmi went viral, but the movie couldn’t draw audiences to theatres.

ఈసీ ఎఫెక్ట్: సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంతంతే!ఈసీ ఎఫెక్ట్: సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంతంతే!

బీహార్ అసెంబ్లీ సహా, తెలంగాణ సహా ప‌లు రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనున్నాయి. నవంబరు 9, 11 తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని సీఎం ఒమర్ అబ్దుల్లా నియోజకవర్గం బుడ్గమ్ నియోజకవర్గానికి,